దిశ కేసును బూచిగా చూపి..సోషల్ మీడియాను కట్టడి చేసే దిశగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లుగా.. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనను బట్టి అర్థమవతోందని ప్రచారం జరుగుతోంది. దిశ ఘటనపై అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. జగన్మోహన్ రెడ్డి.. ” సోషల్ మీడియాను చూస్తే నాకు ఒక్కోసారి బాధ వేస్తోంది. ఆడవాళ్ల గురించి నెగిటివ్గా పోస్ట్లు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. ఆ దిశగా చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోస్టింగ్లు ఏవైనా పెడితే సెక్షన్ 354 E ప్రకారం చర్యలు తీసుకొనే ఆలోచనలో కూడా ఉన్నాం…” అని నేరుగానే ప్రకటించారు. బుధవారం ఈ మేరకు చట్టం తీసుకొస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు.
354 E అంటే.. ఫేస్ బుక్ పోస్టుల ఆధారంగా..మహిళలపై వేధింపులు కేసులు పెట్టే వేసులు బాటు కల్పించడం అన్నమాట. సోషల్ మీడియాను అత్యధికంగా దుర్వినియోగం చేస్తున్నది.. వైసీపీ కార్యకర్తలే. వారి దుష్ప్రచారం… మార్ఫింగ్ పోస్టులు… వెల్లువెత్తుతూ ఉంటాయి. ఇతర పార్టీల నేతల్ని.. అత్యంత దారుణంగా.. హ్యూమలేట్ చేయడానికి వెనుకాడని టీం వైసీపీ దగ్గర ఉంది. అయితే.. ఇతర పార్టీలకు చెందిన ఎవరైనా.. వైసీపీ నేతలపై పోస్టులు పెడితే.. పోలీసులతోనే.. కొట్టి స్తున్నారు. కేసులు పెట్టిస్తున్నారు. కానీ వైసీపీ వాళ్లు మాత్రం ఇతర నేతల్ని అంటే..వారు మనసులో కుమిలిపోవాలి తప్ప.. చేయగలిగిందేమీ లేదు.
తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. సోషల్ మీడియాను స్వేచ్చగా వినియోగించుకున్న జగన్… ఆయన పార్టీ కార్యకర్తలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై అత్యంత దారుణమైన భాషను వాడిని.. సమర్థించారు. అప్పుడు ఆయనకు.. వారి ఇంట్లో మహిళలకు అన్న విషయం గుర్తుకు రాలేదు. శాసన మండలిని అత్యంత దారుణంగా ఓ వ్యభిచార గృహంగా చిత్రీకరిస్తే.. పోలీసులు కేసు పెడితే.. దాన్ని కూడా ఖండించారు. కానీ ఇప్పుడు.. మాత్రం.. తమ పార్టీ అధికారంలో ఉంది.. కాబట్టి.. అందర్నీ కట్టడి చేయాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.