నయనతార వర్సెస్ ధనుష్…. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ పెళ్లిని తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని విశేషాల్ని ఒక డాక్యుమెంటరీ లాగా చేసి అదే వేదికపై తాజాగా విడుదల చేసింది. ఇందుకుగాను కొన్ని కోట్ల రూపాయలు నయనతార ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ తరహా బిజినెస్ లు చేశారు.
అయితే నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ‘నేనే రౌడీ’ సినిమా ఫుటేజ్ ని వాడినందుకు ఏకంగా 10 కోట్ల కాపీరైట్ డిమాండ్ చేశాడు ధనుష్. ఈ మేరకు నయనతార కి నోటీసులు పంపించాడు. దీనిపై నయనతార ఓపెన్ లెటర్ రాసింది. మూడు సెకండ్ల వీడియో వాడినందుకు పది కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ధనుష్ జెలసీ క్యారెక్టర్ ని బయటపెట్టిందని తీవ్ర విమర్శలే చేసింది.
దీంతో నయనతార, ధనుష్ ఇష్యూ పబ్లిక్ అయింది. ఈ వివాదం పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు నయనతార పక్షాన నిలిచారు. ఆమెకు అనుకూలంగా ట్వీట్లు వేశారు. అయితే ఈ విషయంలో ధనుష్ కి అండగా ఫాన్స్, నెటిజన్లు నిలిచారు. ఈ వివాదంలో నయనతార ధనుష్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటుంది. నిజానికి ఆ విమర్శలు చూస్తే నయనతారపై ఈ రేంజ్ లో నెగిటివ్ నెగిటివిటీ ఉందా అని ఆశ్చర్యపడిన చేస్తుంది.
నయనతార ఓపెన్ లెటర్ రాసినప్పుడు మూడు సెకండ్ల వీడియో కి 10 కోట్లు డిమాండ్ చేయడమా? అని కాస్త వింతగానే తోచింది. ఒక నటిగా ఆమెకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండొచ్చేమో అనే భావన కలిగింది. కానీ ఇక్కడ ధనుష్ ఫాన్స్ చాలా నిర్మాణాత్మకంగా నయనతార విమర్శలని తిప్పి కొడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ధనుష్ పెదవి విప్పలేదు కానీ, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్న కొన్ని ప్రశ్నలకు నిజంగా నయనతార సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది.
సోషల్ మీడియా వేదికగా ధనుష్ ఫ్యాన్స్ నయన్ కు సంధిస్తున్న ప్రశ్నలు, విమర్శలు కొన్ని:
*నయనతార చేసింది చారిటీ కాదు. ఆమె పెళ్లిని కూడా బిజినెస్ చేసుకుంది. ధనుష్ తన సొంత డబ్బుతో కష్టపడి ఒక సినిమా నిర్మించుకున్నాడు. ఆ సినిమాలోని ఒక్క ఫోటోని కూడా వాడే హక్కు తన పెళ్లిని బిజినెస్ గా మార్చిన నయనతారకి ఎక్కడుంది?
*అసలు నయనతార డాక్యుమెంటరీ వస్తున్నట్లుగా ప్రచారమే లేదు. ఆ డాక్యుమెంటరీని ఎవరు పట్టించుకోలేదు. చివరి నిమిషంలో ఏదో హైపు కోసం ఓపెన్ లెటర్ రాసి పబ్లిసిటీ తెచ్చుకో తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఇది నిజం కాదా ?
*10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని కనీసం ఒక్క సినిమా ప్రెస్ మీట్ కూడా హాజరు కానీ నయనతారకి కోట్లు పెట్టి సినిమా నిర్మించిన ధనుస్ కాపీరైట్ కింద పది కోట్లు వసూలు చేయడం అసలు చేయడంలో అసలుతప్పేమిటి ?
*నయనతార పక్కా బిజినెస్ చేసింది. తన పెళ్లికి మీడియాని, బంధుమిత్రులని ఎవరిని ఆహ్వానించలేదు. కేవలం ఫేస్ వాల్యూ కోసం ఫిలిం స్టార్స్ నే ఆహ్వానించింది. అజిత్, విజయ్ కి ఈ సంగతి తెలిసే వేడుకకు వెళ్లలేదు. జవాన్ సినిమా పుణ్యమా అని షారుక్ ఖాన్ ని ఏదో విధంగా తన వివాహానికి లాక్కొచ్చి తన డాక్యుమెంటరీకి వ్యాల్యూ పెంచుకుంది. ఇది నిజం కాదా ?
*ధనుష్ ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. తను ఆ సినిమా నిర్మాత. తన అనుమతి లేకుండా ఆ ఫుటేజ్ ని వాడడం ముమ్మాటికి తప్పు. తన పెళ్లిని బిజినెస్ చేసుకోవడంలో నయనతారకు ఎంత హక్కు ఉందో తన సినిమాపై సర్వహక్కులు ధనుస్ కి వున్నాయి.. ఇలా సాగుతున్నాయి ధనుష్ ఫ్యాన్స్ విమర్శలు, ప్రశ్నలు.
నిజానికి నయనతార ఓపెన్ లెటర్ రాసిన వెంటనే ఆమెకు సపోర్ట్ కి చాలా మంది సెలబ్రెటీలు ట్వీట్లు వేశారు. కానీ ఈ విషయంలో ధనుష్ ఫ్యాన్స్ లాజికల్ గా ప్రశ్నిస్తుండేసరికి మదత్తుగా నిలిచిన ట్విట్టర్ హ్యాండిల్స్ సైలెంట్ అయిపోయాయి. నయనతార సాధ్యమైనంత వరకూ మీడియాకి వివాదాలకు దూరంగా వుండాలనే భావిస్తుంది. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పకపోవచ్చు కానీ స్వయంగా ధనుష్ ఈ విషయంలో తన స్పందన తెలియజేస్తే మాత్రం ఈ వివాదం ఇంకా ముదురుతుంది.