ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం ఆదాయం గణనీయంగా పెరిగింది. అది కూడా… మిగిలిన చోట్ల… సాధారణంగానే ఉన్నా.. ఏపీ పొరుగు జిల్లాల్లో మాత్రం… 30 శాతం వరకూ పెరుగుదల నమోదవుతోంది. అదంతా.. అక్కడ్నుంచి ఏపీలోకి వస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు… షాక్ కొట్టేలా చేశారు జగన్. అలాగే.. ప్రముఖ బ్రాండ్లూ లేవు. నీదే బ్రాండ్..నీదే బ్రాండ్ అని పలకరించుకునే మందుబాబులకూ.. ఆ బ్రాండ్లు అందుబాటులో లేకుండా పోయాయి. వీరి అవసరాల్ని స్మగ్లర్లు తీరుస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. పొరుగురాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నారు.
ఏపీలో జూన్ లో 12లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో ఈ సంఖ్య 28లక్షలు. జూన్‌తో పోలిస్తే నాలుగు లక్షల కేసులు ఎక్కువ. పెరుగుదల అంతా సరిహద్దు జిల్లాల్లోనే. కర్నాటకలో మే నెలలో 44లక్షల మద్యం కేసుల అమ్మకాలుంటే.. జూన్‌లో అది 56లక్షలకు చేరింది. ఒక్క నెలలో పెరిగిన 12లక్షల కేసుల అధిక అమ్మకాల్లో సగం రాయలసీమ జిల్లాలకు వచ్చి ఉంటాయని ఎవరైనా అంగీకరించే నిజం. అయితే ఏపీలో రేట్లు బాదేసినా ఆదాయం పడిపోతుంది. మరో వైపు చీప్ లిక్కర్ తాగావాళ్లు… శానిటైజర్లకు బానిసలవుతున్నారు. ఇలా శానిటైజర్లు తాగిన వారిలో ఇరవై మంది వరకూ చనిపోయారు.
మద్యం దుకాణాలు తగ్గించడం… రేట్లు పెంచడం వంటి చర్యల వల్ల.. మద్యానికి బానిసైన వాళ్లు మానేస్తారనుకోవడం పొరపాటని నిపుణులు ముందు నుంచీ చెబుతున్నారు. ప్రభుత్వ తీరు వల్ల నాటు సారానే కాదు.. అక్రమ మద్యం రవాణా కూడా విపరీతంగా పెరిగింది. ప్రత్యేకంగా ఎస్ఈబీ అనే శాఖను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నప్పటికీ.. ఏ మాత్రం… తగ్గడం లేదు. ఓ వైపు ఆదాయం.. కోల్పోయి.. మరో వైపు పొరుగు రాష్ట్రాలకు వరంగా మారిన నేపధ్యంలో ప్రభుత్వం ధరల తగ్గింపు ఆలోచన చేస్తోందని అంటున్నారు.