హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనాలంటే.. ముఖ్యంగా ఐటీ కారిడార్ చుట్టూ ఇల్లు కొనాలంటే కనీసం కోటి రూపాయలు పెట్టాలి. కానీ కొన్ని చోట్ల మాత్రం కోటి లోపలే ఇళ్లు లభిస్తున్నాయి అలాంటి ప్రాంతం నెక్నాంపూర్. మణికొండను ఆనుకుని ఉండే నెక్నాంపూర్ లో గతంలో ఫామ్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ విజృంభణ కనిపిస్తోంది. అక్కడ నివసించే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్, విల్లాల నిర్మాణం విస్తృతంగా జరుగుతోంది. మణికొండ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటం వల్ల ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం 50 నుంచి 80 లక్షల రూపాలకు లభిస్తోంది. అదే కాస్త విశాలంగా లగ్జరీ సౌకర్యాలతో.. హై రైజ్ తరహా అపార్టుమెంట్లు అయితే త్రిబుల్ బెడ్ రూం రూ.80 లక్షల నుంచి లభిస్తోంది. కోటిన్నర వరకూ సౌకర్యాలను బట్టిస్తున్నాయి. స్క్వేర్ ఫీట్‌కు రూ. 4,500 నుండి రూ.6,500 మధ్యలో ఉంటాయి. ఇతర సౌకర్యాలను బట్టిచార్జీలు పెరగవచ్చు.
ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణం నిర్మాణం జోరుగా సాగుతోంది. స్థానిక మేస్త్రీలు వీటిని నిర్మిస్తున్నారు. 150-200 గజాల స్థంలోలఉండే ఇళ్లు కోటి నుండి రూ. 1.5 కోట్ల వరకు చెబుతున్నారు. ఎక్కువ స్థలం లో ఇల్లు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ధర అవుతుంది. ఈ ప్రాంతంలో పలు ప్రముఖ కంపెనీలు గేటెడ్ కమ్యూనిటీలలో లగ్జరీ విల్లాలు నిర్మించాయి. రెండున్నర నుంచి ఐదు కోట్ల వరకూ అమ్ముతున్నారు.
నెక్నాంపూర్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. – ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండటం వల్ల రెంటల్ డిమాండ్ కూడా ఎక్కువే. అంటే మధ్యతరగతితో పాటు .. లగ్జరీ కోరుకునేవారికి కూడా నెక్నాంపూర్ మంచి అనువైన ప్రదేశం అనుకోవచ్చు.