రవితేజను అభిమానులు ముద్దుగా మాస్ మహారాజ్ అని పిలుచుకుంటారు. అందుకు ఓ కారణం వుంది. అతని కంటూ టిపికల్ స్టయిల్ సృష్టించుకున్నాడు. హీరోయిజమ్ కావొచ్చు, మేనరిజమ్స్ కావొచ్చు, కామెడీ కావొచ్చు… రవితేజ కంటూ సపరేట్ స్టయిల్ వుంటుంది. దాన్నుంచి బయటకు వెళ్లకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘నేల టికెట్టు’ ట్రైలర్ కట్ చేశాడు. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం. లైఫ్ అంటే అలా వుండాలి’ అనేది హీరో ఫిలాసఫీ. ఇప్పటికే విడుదలైన టీజర్లో హీరో క్యారెక్టర్, ఫిలాసఫీ, క్యారెక్టరైజేషన్లను చూపించారు. ట్రైలర్లో విలన్ జగపతిబాబుని, ఆయన పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ట్రైలర్‌ని బట్టి ఇదొక రవితేజ మాస్ మసాలా కామెడీ. దానికి దర్శకుడు ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ మెసేజ్ యాడ్ చేశాడు. 30 ఇయర్స్ పృథ్వీ, ప్రవీణ్ పంచ్ డైలాగులు బాగున్నాయి. లుక్స్ పరంగా రవితేజ ‘బలుపు’, ‘పవర్’ సినిమాలను గుర్తు చేస్తున్నాడు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా వుంది. మరి, ఈ టిపికల్ మాస్ మహారాజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.