జగన్ రెడ్డి వైసీపీలో ఎవర్నీ శాటిస్ ఫై చేయలేకపోతున్నారు. అత్యంత సన్నిహితులు .. ఆయన కోసం అడ్డగోలు పనులు చేసిన వారు కోరుకునే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఈగోలకు పోతూండటంతో అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు. చివరికి YSRCPలో పేరుతో ఉండే ఐదుగురు రెడ్లలో ఒకరిగా పేరు పొందిన ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి కూడా జగన్ రెడ్డి తీరుపై ఆగ్రహం చెంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే మామూలు వ్యక్తి కాదు. జగన్ రెడ్డి కోసం ఈ ఐదేళ్లలో తినని గడ్డి లేదు. వజ్రాల వాచ్లను స్టాక్ పెట్టుకుని టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి ఎక్కడికి అవసరమైతే అక్కడికి పోయి… బహుమతులు ఇచ్చి వచ్చే వారు. ఢిల్లీ వర్గాల్లో ఆయనకు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలాంటి వేమిరెడ్డి కూడా ఇప్పుడు జగన్ రెడ్డిపై అలిగి ఢిల్లీ వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్ సభ అభ్యర్థి. ఆయన పట్టుబట్టడంతోనే అనిల్ కుమార్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించారు. కానీ మళ్లీ అనిల్ అనుచరుడికే అక్కడ టిక్కెట్ ఇవ్వడం.. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు.
ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అనుచరులుక చెప్పి ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే జగన్ రెడ్డితో ఆయనకు అంత తేలికగా తెంచుకునే బంధం కాదు. చాలా బినామీల లెక్కలు ఉన్నాయని వైసీపీలో అంటున్నారు. జగన్ రెడ్డి.. చివరికి ఆయన భార్యకే నెల్లూరు సిటీ టిక్కెట్ ఇస్తామని ఒప్పించి.. బుజ్జగిస్తారని అంటున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తూంటే.. జగన్ రెడ్డి ఎవర్నీ మొప్పించలేకపోతున్నారని వైసీపీలోనే సెటైర్లు పడుతున్నాయి.