ఈ నెల 11న మూడు చిత్రాలు బరిలో దిగబోతున్నాయి. జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి విడుదలకు ఢీ అంటున్నాయి. అయితే.. ఇప్పుడు రానా సినిమా కాస్త డైలామాలో పడింది. 11న ఈ సినిమా వస్తుందా, రాదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. 11న వస్తే.. సెలవలు కలిసొస్తాయి. సెప్టెంబరులో పెద్ద సినిమాల హడావుడి నుంచి తప్పించుకోవాలంటే.. ఆగస్టులోనే రావాలి. అందుకే చాలా సినిమాలు ఆగస్టు కోసం కాచుకొని కూర్చున్నాయి. ఒకేసారి మూడు సినిమాలు వచ్చేంత స్పేస్ ఉన్నా – రానా సినిమా మాత్రం 11న రావాలా, వద్దా అని ఆలోచిస్తోందట. దానికీ కారణాలున్నాయి. నేనే రాజు నేనే మంత్రి తమిళంలోనూ భారీగా విడుదల చేయాలన్నది నిర్మాతల ఉద్దేశం. అయితే.. 11న తేదీన తమిళంలో అజిత్ సినిమా – వివేగం విడుదలకు సిద్దమైంది. అజిత్‌తో పోటీ పడడం.. అక్కడ చాలా కష్టం. పైగా కావల్సిన సంఖ్యలో థియేటర్లు కూడా దొరకవు. అందుకే… 11న తేదీన నేనే రాజు రావడం కాస్త అనుమానంగా మారింది. ఈరోజు హైదరాబాద్‌లో నేనే రాజు నేనే మంత్రి యువ గర్జన పేరుతో ఓ పబ్లిసిటీ ఈవెంట్ నిర్వహించబోతోంది చిత్రబృందం. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.