నటీనటులు: రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, రోహిణి, నరేష్, ప్రదీప్ రావత్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
తెలుగు360 రేటింగ్: 3.5/5
కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కెరియర్ అస్థవ్యస్థంగా తయారైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు 2016 మొదటి రోజున అగ్ని పరిక్షలా నేను.. శైలజ.. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. 2015 సంవత్సరం అభిమానులను నిరాశ పరచిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్క్రీన్ నేంలోని ఎనర్జీని ఎక్కడ చూపించలేదు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో నేను.. శైలజా అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నూతన సంవత్సరం మొదటిరోజున విడుదలైన రామ్ నేను..శైలజ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది మన సమీక్షలో చూద్దాం.
కథ:
చిన్న నాటినుండి తనకు ఏం కావాలో స్పెషల్ గా ఉండేవాడు హరి (రామ్) చిన్నప్పుడే శైలజ (కీర్తి సురేష్) ని చూసి ఇష్టపడతాడు. తనని నవ్వించడం కోసం ఆరాటపడే హరికి సడెన్ గా తండ్రి (నరేష్) కు ట్రాన్స్ ఫర్ అవ్వడంతో చిన్నప్పుడే శైలజని వదిలి వెళ్తాడు. శైలజని ప్రేమిస్తున్న విషయం కూడా దాచిపెడతాడు. ఇక శైలజని మర్చిపోయి నచ్చిన అమ్మాయినల్లా ప్రపోజ్ చేస్తూ వారితో సారీ ఛీ కొట్టించుకోవడం అలవాటుగా మారుతుంది హరికి. ఓ పబ్ లో డీజె ఆపరేటర్ గా పనిచేస్తున్న తనకు సడెన్ గా యాడ్ మేకర్ శైలజ పరిచయం అవుతుంది. శైలజ పరిచయం ప్రేమగా మారేలోపే తన మీద మంచి అభిమానం పెరుగుతుంది. ఇక అదే శైలజ తన చిన్ననాడు అభిమానించిన అమ్మాయే అని తెలియగానే ఆమెకు తన లవ్ ఎక్స్ ప్రెస్ చేస్తాడు. సరిగ్గా ఇదే టైంలో శైలజకు కూడా హరి చిన్ననాటి స్నేహితుడే అనే విషయం తెలిసే సరికి ఇంటి నుండి కబురు రావడం వాళ్లింట్లో వాళ్లు కుదిర్చిన సంబంధం ఒప్పుకోవడం జరుగుతుంది. శైలజ నాన్న శ్రీనివాస్ (సత్యరాజ్) చిన్న నాటి నుండి పిల్లల కోసమే కష్టపడుతూ వారికి దూరంగా ఉంటూ వారిపై తన ప్రేమను కూడా దూరం చేసుకుంటాడు. ఇంతకీ శైలజ హరి ప్రేమను అంగీకరించిందా..? శైలజ ప్రేమను దక్కించుకోవడం కోసం హరి ఏం చేశాడు..? శ్రీనివాస్ శైలజ పెళ్లి ఎవరితో నిశ్చయిస్తాడు..? అన్నదే అసలు కథ.
సాంకేతిక నిపుణత :
నేను శైలజ సినిమాకు పనిచేసిన సాంకేతిక వర్గం సినిమాకు మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమా దర్శకుడు అనుకున్న కథకు చక్కని లొకేషన్స్ షూట్ చేసి రామ్, కీర్తిలను అందంగా చూపించి మరోసారి తన కెమెరా పనితనం చూపించాడు సమీర్ రెడ్డి. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు అంతే ఎనర్జీ ఉన్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో అచ్చం ఈ సినిమా మ్యూజిక్ అలా ఉంది. సినిమాకు నేపథ్య సంగీతం కూడా మంచి స్కోర్ చేసింది. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనిపించుకుంటే సెకండ్ హాఫ్ లో మరికొంత ట్రిం చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సినిమా కథ కథనాల్లో దర్శకుడు కిశోర్ పడిన జాగ్రత్త మెచ్చుకోదగ్గది తన కథకు తగ్గ మాటలతో సినిమాకు మంచి బలాన్ని చేకూర్చేలా చేశాడు. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ విలువలు మరోసారి సూపర్బ్ అనిపించుకున్నాయి.
నటీనటుల ప్రతిభ – విశ్లేషణ :
నేను.. శైలజ అంటూ సాఫ్ట్ టైటిల్ తో రామ్ సినిమా స్టార్ట్ చేసినప్పుడే సినిమా మంచి లవ్ స్టోరీ అని ఆడియెన్స్ గెస్ చేయగలిగారు. అయితే కొద్దిరోజులుగా రొటీన్ సినిమాలు చేస్తున్నాడు రామ్ అనే అపవాదాన్ని ఈ సినిమా పోగొట్టిందనే అనాలి. స్వతహాగా రచయిత అవ్వడం చేత తను రాసుకున్న కథా, కథనాల్లో దర్శకుడు ఎక్కడ పట్టు తప్పలేదని చెప్పాలి. సినిమా లైన్ చిన్నదే అయినా దానికి దర్శకుడు రాసుకున్న స్క్రీ ప్లే అద్భుతం. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఇంకాస్త క్లారిటీని మెయింటైన్ చేస్తే బాగుండేది. సినిమా రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు దర్శకుడు కిశోర్ తిరుమల. కొన్ని సీన్స్ లో దర్శకుడు రాసుకున్న మాటలు చాలా బాగా పేలాయి.
ఇక నటీనటుల విషయానికొస్తే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడు. హరి పాత్రకు తగ్గ అభినయాన్ని కనబరుస్తూ ఎక్కడ క్యారక్టర్ నుండి బయటకు రాలేదు. ఇక కొద్దికాలంగా రొటీన్ అనే మాటకు అలవాటు పడ్డ రామ్ ఈ సినిమా కాస్త కొత్తగా ప్రయత్నించాడనే చెప్పాలి. రామ్ కు కరెక్ట్ టైంలో మంచి సినిమా పడ్డదనే అనొచ్చు. ఇక శైలజ కీర్తి సురేష్ విషయానికొస్తే దర్శకుడు ఈ పాత్రకు ఆమెనే ఎందుకు తీసుకున్నాడో తెలుస్తుంది. శైలజ పాత్రకు కీర్తి సరిగ్గా సూట్ అయ్యింది. ఎప్పుడు సీరియస్ రోల్స్ చేసే ప్రదీప్ రావత్ ఈ సినిమాలో మహర్షిగా కామెడీ రోల్ చేసి అందరిని నవ్వించాడు. సత్యరాజ్, నరేష్, రోహిణి, ఎవరి పాత్రల మేరకు వారు తమ అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
రామ్
కీర్తి సురేష్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
నేరేషన్
రొటీన్ క్లైమాక్స్
తీర్పు :
రామ్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే వారికి, రామ్ ని కొత్తగా చూడాలనుకునే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. నేను..శైలజ అంటూ నూతన సంవత్సర కానుకగా వచ్చిన రామ్ ఇదవరకు సినిమాల కన్నా బెటర్ అనిపించుకున్నా అక్కడక్కడ సినిమా మళ్లీ రొటీన్ కొట్టుడే అనే ఫీలింగ్ కలుగుతుంది. రామ్, కీర్తిల రొమాన్స్ సినిమాలో లేకపోవడం కాస్త ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఫీల్ గుడ్ ప్రేమకథ అనిపించే రొటీన్ సినిమాగా మిగిలే ‘హరి’ కథ ఈ నేను..శైలజ. చివరగా సినిమా ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంటుంది. సరదాగా సినిమాలు చూసే వారికి తప్పకుండా నచ్చే చిత్రం.