అదేంటో..నేపాల్‌కు కూడా ఇండియాను బాగా లైట్ తీసుకుంటోంది. భారత భూభాగాలను.. తమవే అని చెప్పుకుని..నేరుగా మ్యాప్‌లు మార్చేసుకుంటోంది. చరిత్రలో కూడా… లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా అనే ప్రాంతాలు భారత భూభాగాలుగానే ఉన్నాయి. గత యాభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ వీటిని చర్చనీయాంశం చేయని నేపాల్ హఠాత్తుగా… ఆ భూభాగాలు తమవే అని.. చెప్పుకుంటోంది.ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పాస్ చేసేసుకుంది. అధికారిక లాంఛనాలను పూర్తి చేసి.. ఆ ప్రాంతాలు తమవేనని ప్రకటించుకోనుంది. ఆ తర్వాత వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
అయితే.. నేపాల్ భారత్‌తో ఎప్పుడూ.. ఇలా ఘర్షణకు దిగే వాతావణాన్ని తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం దూకుడుగా ఉంది. కరోనా కన్నా.. ఇండియా వైరస్సే ప్రమాదకరమని కొన్ని రోజుల కిందట..నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించడం… వారికి ఉన్న వ్యతిరేకత ఏమిటో బయటపడుతోంది. ఎంత వ్యతిరేకత ఎందుకు పెంచుకుంటున్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదు. భారత విదేశాంగ విధానం వల్ల పొరుగు దేశాలతో సఖ్యత లేకుండా పోయిందన్న భావన ఏర్పడింది. చైనా.. అదే పనిగా.. నేపాల్‌కు ఆర్థిక సాయం చేసి.. ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకలతోనూ చైనా… భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. కానీ.. భారత్ వాటిని తిప్పికొట్టలేకపోతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నేపాల్‌తో సరిహద్దు వివాదం.. ప్రాంతాల వివాదం ఏర్పడితే.. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ముందుగానే చెక్ పెట్టాల్సిన పరిస్థితిలో కేంద్రం.. సైలెంట్‌గా ఉంటోంది.