సినిమాలను ప్రచారం చేయడంలో వెబ్సైట్లను ఉపయోగించుకోవడం గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. ట్రయలర్లు లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ విసుగెత్తించే వెబ్సైట్ల స్థానాన్ని యూట్యూబ్ ఆ తరువాత భర్తీ చేసింది.
ప్రస్తుతం సినిమాల ప్రచారకులు అభిమానులకు సులభంగా, వీలుగా ఉండేలా కుల్ఫీ(kulfy) యాప్ వినియోగిస్తున్నారు. స్టిక్టర్లు, గిఫ్లు వాడుతూ ఇందులో సినిమాల ప్రమోషన్ చేస్తారు.
యూట్యూబ్‌లో అయితే అభిమానులు ఒకట్రెండు సార్లు ట్రయలర్లు చూస్తారు కానీ అందులో ఉండే కంటెంట్‌తో ఇంటరాక్ట్ కాలేరు. కానీ, కుల్ఫీ యాప్‌లో అయితే యూజర్లు తమ భావాలను పంచుకుంటూ, చాట్ చేస్తూ, తమకు నచ్చిన నటుల గిఫ్లు, స్టిక్టర్లు జోడిస్తూ పంపించుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ సహా 20,000కు పైగా యాప్‌లలో తెలుగు గిఫ్‌లను అందించేలా గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డిసెంబర్లో ‘కుల్ఫీ’ ప్రకటించింది. సినిమా స్టూడియోలు, ఇతర సంస్థలు కుల్ఫీ యొక్క అసలైన సత్తాను గుర్తించి తమ విలువైన వనరులు, సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాయి.
సరికొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru GIFs) కోసం వాట్సాప్, మెసెంజర్, ట్విట్టర్, జీ బోర్డ్ వంటి చాట్ ప్లాట్‌ఫాంలలో గిఫ్లు, స్టిక్కర్లను ఉపయోగిస్తూ ప్రమోట్ చేయడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కుల్ఫీ యాప్‌తో జత కట్టింది.
ఈ సినిమా ట్రయలర్లలోని కీలక సన్నివేశాలు, డైలాగ్స్, సాంగ్ లిరిక్స్ షేర్ చేయడానికి గిఫ్లు ఇప్పటికే అందుబాటులోకొచ్చాయి. ‘మన దగ్గర బేరాల్లేవమ్మా’ అంటూ మహేశ్ బాబు, ‘మీకు అర్థమవుతుందా?’ అంటూ హీరోయిన్ రష్మిక చెప్పిన డైలాగులకు సంబంధించిన గిఫ్లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి.
కేవలం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన గిఫ్లే కాదు. రానున్న సినిమాలు ‘అలవైకుంఠపురంలో’ వంటివి, ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు, మరెన్నో తెలుగు ట్రెండింగ్ గిఫ్లు కూడా మీకోసం కుల్ఫీలో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు చాటింగ్, కామెంట్లలో వాడుతూ ఆనందం పొందొచ్చు.
ఈ కుల్ఫీ యాప్ లాంచ్ చేసిన తరువాత ఇప్పటివరకు 10 కోట్ల గిఫ్లు ఈ వేదిక ద్వారా వాడుకున్నారు, వీటి కోసం 25 కోట్ల సెర్చ్ రిక్వెస్టులు వచ్చాయని కుల్ఫీ సహ వ్యవస్థాపకులు బసంత్ వాలేటి, గిరీశ్ కొల్లూరి చెప్పారు.
ఒక నిర్దిష్ట భావోద్వేగంలోని అనుభూతిని కేవలం 3 నుంచి 5 సెకండ్ల తక్కువ సమయంలోనే గ్రహించడం గిఫ్ల అందం, గొప్పతనమని వారు చెప్పారు. కాబట్టి మీ భావాలను వివరంగా చెప్పాలనుకోవడం కంటే ఒక సరైన గిఫ్‌ను వాడి సరిగ్గా నప్పేలా సందేశాలను పంపించుకోవచ్చని వారు సూచించారు.
కుల్ఫీ యాప్‌ను ఇప్పుడే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చాట్లలో మీ భావాలను వ్యక్తీకరించుకోండి.
కుల్ఫీ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Click here to download the App
వాట్సాప్ మెసేజ్‌లలో తెలుగు స్టిక్కర్లు వాడడమెలాగో ఈ బ్లాగులో చూడండి: https://kulfyapp.com/blogs/how-to-use-telugu-stickers-in-whatsapp
సరిలేరు నీకెవ్వరు సినిమా పేజ్: https://kulfyapp.com/movie/sarileru-neekevvaru
మరిన్ని విషయాల కోసం ట్విట్టర్ లో ఫాలో అవ్వండి: @kulfyapp
కుల్ఫీ గురించి: కుల్పీ న్యూయార్క్ బేస్డ్ స్టార్టప్. తెలుగు గిఫ్లు, చిన్నచిన్న క్లిప్‌లు, స్టిక్కర్ల మీ ఫేవరెట్ మెసేజింగ్, సోషల్ మీడియా వేదికలపై క్షణాల్లో తయారుచేసుకోవడానికి, వెతకడానికి, షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
Press release by: Indian Clicks, LLC