తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలకు అవకాశం ఎప్పుడూ వుంటుంది. కొంచెం అందం, అభినయం వున్న తారలు ఇక్కడ రాణించవచ్చు. అభిమానుల’ఫేవరేట్ హీరోయిన్’ లిస్టు లో చేరవచ్చు. కానీ ఆ లిస్టు లో చేరడం అంత తేలిక కాదు. ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెరపై కనిపించినా అందులో మెరిసే తారలు శాతం మాత్రం తక్కువే. ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో కొత్త కథానాయికలు తెరపైకి వచ్చారు. ఇందులో ఒకే సినిమాతో స్టార్ అయినపోయిన భామలు, హీరోయిన్ గా నిలబడే అవకాశాలు వున్న తారలు, మరో ఛాన్స్ కోసం ఎదురుచేసే కథానాయికలు వున్నారు. ఒక్కసారి వివరాల్లోకి వెళితే..
కృతి శెట్టి:
ఈ ఏడాది ‘స్టార్’గా బోణీ కొట్టింది కృతి శెట్టి. మొదటి సినిమా ఉప్పెనతో ఒక ఉప్పెనలా దూసుకొచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే కృతిపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘నీకళ్ళు నీలి సముద్రం’ పాట విడుదలైన తర్వాత యూత్ లో కృతికి ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు ‘బేబమ్మ’గా మారిపోయింది. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలు వున్నాయి. నానితో చేసిన ‘శ్యామ్ సింగరాయ్ విడుదలకు సిద్ధమౌతుంది. నాగార్జున – నాగచైతన్యల ‘బంగార్రాజు’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు రామ్ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ కృతినే హీరోయిన్. మొత్తానికి ఒక్క సినిమాతో కృతి జాతకమే మారిపోయింది
ప్రియా ప్రకాష్ వారియర్: ఒక్క కన్నుగీటుతో వైరల్ గా మారిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. మొదటి సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో ఆమె పేరు సంచలనంగా మారింది. ఆమె నటించిన మలయాళం సినిమా ఓరు అదార్ లవ్ లో వింక్ సీన్ సోషల్ మీడియాని షేక్ చేసింది. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయింది. అయితే ఈ ఏడాది తెలుగులో తెరంగేట్రం చేసింది ప్రియా. నితిన్ చెక్ సినిమాలో నటించింది. చంద్రశేఖర్ ఏలేటి లాంటి దర్శకుడి సినిమాలో ఛాన్స్ రావడం అంత తేలిక కాదు. అయితే బ్యాడ్ లక్ ..చెక్ బాగా ఆడలేదు. ప్రియ పాత్రకు కూడా పేరు రాలేదు. తర్వాత చేసిన ఇష్క్ సినిమా కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ హిందీ, కన్నడ సినిమాలు వున్నాయి. తెలుగులో మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.
దృశ్య రఘునాథ్ : షాది ముబారక్ సినిమాలో మెరిసిన భామ దృశ్య రఘునాథ్. మొదటి సినిమానే నటనకు స్కోప్ వున్న పాత్ర ఆమెకు దక్కింది. ఇందులో సాగర్ హీరో. కానీ కధనం మొత్తం తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) చుట్టూ తిరుగుతుంది. ఆమె నటన కూడా బావుంది. తుపాకుల సత్యభామ పాత్రలో డీసెంట్ వినోదాన్ని పంచింది. అందంగా కూడా వుంది. మంచి ప్రెసెన్స్. భవిష్యత్ లో నటనకు ఆస్కారం వుండే పాత్రలు ఆమెకు వచ్చే ఛాన్స్ వుంది.
ఫారియా అబ్దుల్లా : జాతి రత్నాల్లో ఫారియా కూడా ఓ జాతి రత్నమే. అనుష్క తర్వాత మళ్ళీ అంత ఎత్తుపొడుగు వున్న హీరోయిన్. స్వయంగా ప్రభాస్ చేత.. ‘ఈ అమ్మాయి ఎవర్రా బాబు.. నా కంటే ఎత్తుగా వుంది” అని కితాబు అందుకుంది ఫరియా. జాతి రత్నాలు విడుదలైన తర్వాత అభిమానులు క్యుట్ అండ్ స్వీట్ మారిపోయింది. నటన కూడా బావుంది. ”ఇచ్చేయండి సర్.. బెయిల్ ఇచ్చేయండి” అని క్యుట్ గా వాదించే లాయర్ గా వినోదాన్ని పంచింది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కనిపించింది, ఇప్పుడు బంగార్రాజు సినిమాలో ఓ డ్యాన్స్ నెంబర్ చేస్తుంది. ప్రామెసింగ్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఆమెలో కనిపిస్తున్నాయి.
మిషా నాంగర్: శ్రీసింహా హీరోగా వచ్చిన ‘తెల్లవారితే గురువారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైయింది మిషా. ఆమెకు మంచి పాత్ర దక్కింది. దాదాపు సినిమా రన్ టైం లో ఎక్కువ బాగం ఆమె పాత్ర వుంటుంది. అమాయకంగా, పక్కింటి అమ్మాయి తరహా పాత్రతో మిషా నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో అభినయం బావుంది. సినిమా నిరాశ పరిచినా నిషా నటన మాత్రం ఆకట్టుకుంది.
మీనాక్షి చౌదరి : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా నిరాశ పరిచినప్పటికీ ఆమె గ్లామర్ ఆకట్టుకుంది. నిజానికి సినిమాకి రాకముందే మీనాక్షి గ్లామర్, మోడల్ ప్రపంచంలో పాపులర్. బ్యూటీ మెడల్స్ సొంత చేసుకుంది. రవితేజ ‘ఖిలాడి’ , అడివి శేష్ ‘హిట్ 2’ చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంది. అయితే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ముందుగా విడుదలైయింది. అన్నట్టు..ప్రభాస్ ‘సలార్’ సినిమాలో కూడా మీనాక్షికి ఓ కీలక పాత్ర చేస్తుందని తెలిసింది.
కేతిక శర్మ: హీరోయిన్స్ ని వెదికి పట్టుకోవడంలో పూరి జగన్నాధ్ ది ‘స్టార్’ మార్క్. ఆసిన్, హన్సిక, అనుష్క ..లాంటి స్టార్ హీరోయిన్స్ పూరి డైరెక్షన్ లో పరిచయమయ్యారు. ఈ ఏడాది కూడా పూరి హీరోయిన్ తెరపై మెరిసింది. రొమాంటిక్ సినిమాతో కేతిక తెరపైకి వచ్చింది. టైటిల్ తగ్గట్టే వెరీ రొమాంటిక్ గా కనిపించింది. హాట్ లుక్స్ తో కుర్రకారుకి తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నాగశౌర్య లక్ష్య సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు ఆమె చేతిలో వున్నాయి.
శ్రీలీలా: 2021లో వచ్చిన పెళ్లి సందడి హిట్టు కాలేదు కానీ తెరపై ఓ రాఘవేంద్రరావు హీరోయిన్ గా మెరిసింది. ఆమెనే శ్రీలీలా. తెలుగమ్మాయి. ఆమె క్యుట్ లుక్స్ , బబ్లీ యాక్టింగ్ , డ్యాన్సులు బాగానే ఆకట్టుకున్నాయి. తెరపై నిండుగా కనిపించింది. ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. రవితేజ ‘ధమాకా’ లో కనిపిస్తుంది. ఇది కాకుండా శర్వానంద్, నిఖిల్ కొత్త సినిమాల్లో శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నారు. కన్నడలో ‘బైటూలవ్’ అనే ఓ సినిమా కూడా చేస్తోంది.
శివాని రాజశేఖర్: ఈ ఏడాది మరో నట వారసురాలు వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అద్భుతం సినిమాతో శివాని రాజశేఖర్ ప్రేక్షకులకు పరిచయమైయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శివాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. శివాని స్క్రీన్ ప్రజన్స్, టైమింగ్ ఆకట్టుకున్నాయి. నటనకు ఆస్కారం వుండే పాత్రలకు బావుంటుందనే నమ్మకాన్ని ఇచ్చింది శివాని.
వీరే కాకుండా.. రామ్ ‘రెడ్’ లో కనిపించిన అమృత అయ్యర్, అల్లరి నరేష్ నాందిలో నవమి గాయక్, గాలి సంపత్ లో లవ్లీ సింగ్, రాజా విక్రమార్క్ లో తాన్య రవిచంద్రన్, పుష్పక విమానం లో గీత్ సింగ్ .. ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.