ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లా టీంలో కొత్తగా జాస్తి నాగభూషణ్ చేరారు. ఆయనను ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించారు. ఈ జాస్తి నాగభూషణ్ ఎవరో కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుడు. చాలా రోజులుగా ఆయన సీఎం జగన్ కు చెందిన లా టీంతో కలిసి పని చేస్తున్నారు. కానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు.. ఆయనను అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగభూషణ్ కూడా.. న్యాయవాదినే. అయితే.. గొప్పగా పేరు ప్రఖ్యాతులు లేవు. గొప్ప కేసులు వాదించలేదు కూడా.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత జాస్తి చలమేశ్వర్ ఓ సారి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత… కోర్టులపై పోరాటం విషయంలో ఆయన జగన్ బృందానికి సహకరిస్తున్నారని చెబుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో.. కోర్టుల పై ఫిర్యాదులు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సమంయలో.. జాస్తి చలమేశ్వర్ కుమారుడు నాగభూషణ్‌ను కూడా… జగన్ వెంట బెట్టుకుని వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ.. సీజేఐకి రాసిన లేఖలోనూ… జాస్తి చలమేశ్వర్ సహకారం ఉందన్న ప్రచారం ఉంది.
ఈ క్రమంలో… జాస్తి చలమేశ్వర్ కుమారుడికి నేరుగా పదవి ఇవ్వడం.. రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జాస్తి నాగభూషణ్.. న్యాయవాదిలో పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు. గొప్ప గొప్ప కేసులు వాదించిన అనుభవం కూడా లేదు. కేవలం జాస్తి చలమేశ్వర్ కుమారుడిగానే ఆయన చిరపరిచితం. అలాంటిది నేరుగా ఆయనను అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించడం ఆసక్తి రేపుతోంది.