ఒక సినిమా చేయడం.. ఆ సినిమా హిట్ అయితే అయ్యో ఇంకాస్త ఖర్చు పెట్టి దీన్ని బైలింగ్వల్ చేసుంటే బాగుండేది అని బాధపడటం దర్శక నిర్మాతలకు అలవాటుగా మారింది. అందుకే ఇప్పుడు సినిమా సబ్జెక్ట్ స్కోప్ ను బట్టి సినిమాను ముందే బై లింగ్వల్, ట్రై లింగ్వల్ అంటూ లెక్కలేస్తున్నారు. అయితే ఇవి డబ్బింగ్ అనే అపవాదాలు వచ్చినా దేనికున్న డిమాండ్ దానికే ఉంటుంది. మళ్లీ రీమేక్ కు ఖర్చులెందుకు అనుకునే వారు సినిమా చూసి ఆ డబ్బింగ్ వర్షన్ తమ భాషలో రిలీజ్ చేసుకుంటున్నారు.
అయితే భాష ఏదైనా సినిమాకున్న స్కోప్ ఒక్కటే.. సినిమా ఆడియెన్ కు కనెక్ట్ అయితే చాలు అది సూపర్ హిట్ అన్నట్టే. అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో ఫ్లాప్ అయిన దాఖలాలు ఉన్నా.. అవి ఏదో ఒక పొరపాటున జరిగినవే కాని, దాదాపు అన్ని కచ్చితంగా సక్సెస్ సాధించనవే.. ప్రస్తుతం దర్శక నిర్మాతలకు ఇదే కొత్త అలవాటుగా మారింది. సినిమా తీద్దాం కథ ఏంటి అనుకున్న టైంలో ఇదే కథ తమిళ తంబీలకు.. అటునుండి అటు బాలీవుడ్ ప్రేక్షకుల ఆమోదం పొందుతుంది అనే ఆలోచన వస్తే చాలు బై లింగ్వల్, ట్రైలింగ్వల్ అంటూ ఎనౌన్స్ చేస్తున్నారు.
మరి ఊపందుకున్న ఈ పరభాషా చిత్రాల మోజు ఎందాకా వెళుతుందో తెలియదు కాని ప్రస్తుతం మార్కెట్ పెంచుకునే క్రమంలో ఈ కొత్త ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తుంది అనడంలో సందేహం లేదు.