వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చేధించడానికి సీబీఐకి కరోనా అడ్డం వస్తోంది. పదిహేను మంది వరకూ ఉన్న టీమ్‌లో ఏడుగురికి కరోనా సోకడంతో ప్రస్తుతానికి దర్యాప్తు వాయిదా పడింది. వారు మళ్లీ కోలుకునేవరకూ దర్యాప్తు ఉండదని అనుకున్నారు. కానీ సీబీఐ మాత్రం ఆ కేసు విషయాన్ని తేల్చాలని నిర్ణయించుకుంది. దర్యాప్తు ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచి ప్రారంభించేందుకు.. కొత్త బృందాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏజాది జూలై 9న సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ లోని ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. చంద్రబాబే ఆ హత్యను చేయించారని ఆరోపించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని వాదించారు. అయితే.. వైఎస్ వివేకా కుమార్తె మాత్రం.. తన అన్న పాలనలో న్యాయం జరగడం లేదని.. సీబీఐ విచారణ కావాల్సిందేనని హైకోర్టుకు తెలిపింది. పోలీసులు ఈ కేసులో నిందితుల్ని తేల్చలేకపోతూండటంతో.. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. తొలుత వివేకా మృతిని మృతికి కారణం తెలియదనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత హత్యా నేరంగా మార్చారు.
వివేకా కుమార్తె పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సీబీఐ… రెండు విడతలుగా దర్యాప్తు చేసింది. అయితే సీబీఐ అధికారులకు కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన విచారణను కొత్త బృ బృందంతో విచారణ చేయించనున్నారు. కేసును తేల్చాలని నిర్ణయించారు.