ఏపీలో ప్రజాధనాన్ని ఎలా దోచెయ్యాలన్నదాంట్లో పీహెచ్డీలు చేసిన వారు పాలకులుగా ఉన్నారు. ఇలా అనుకుంటారు.. అలా ఓ ఒప్పందం పేరుతో డబ్బులు బదిలీ చేసేస్తారు. విద్యాశాఖలో జరుగుతున్న దోపిడీ అసాధారణంగా ఉంది. విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజార్చడమే కాకుండా పిల్లల కోసమంటూ… రకరకాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకంటూ కోట్లకు కోట్లు కట్టబెడుతున్నారు. ఈ జాబితాలో ఎన్ని కంపెనీలు చేరుతున్నాయో లెక్కే లేదు.
ఎడెక్స్ పేరుతో ఓ కంపెనీతో తాజాగా ఒప్పందం చేసుకుంటున్నారు. ఏక మొత్తంగా యాభై కోట్లు ట్రాన్స్ ఫర్ చేసేందుకు రెడీ అయిపోయారు. శుక్రవారం ఆ పని పూర్తవుతుంది. ఇది అంతర్జాతీయ కోర్సులు ఇస్తుందని.. మరొకటని కబుర్లు చెబుతున్నారు. ఎడెక్స్ అనే సంస్థ వీడియోలు చూసి పిల్లలు నేర్చుకోవాలి. అంటే వీడియో కంటెంట్ ప్రోవైడ్ చేయడానికే కోట్లు అన్నమాట. ఆ కంపెనీ సర్టిఫికెట్లు ఇవ్వదు. అంతకు ముందు బైజూస్ పేరుతో పదిహేను వందల కోట్ల వరకూ కట్టబెట్టారు. తర్వాత టోఫెల్ అన్నారు.. ఈ టోఫెల్ అనేది ఎవరైనా విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టే పరీక్ష. పిల్లలకు ఎందుకో ఎవరూ అడగలేకపోతున్నారు. తర్వాత ఐబీ ఎన్నారు. ఐబీ కేటగరిలో ఒక్క స్కూల్ ఏర్పాటు చేయాలంటే పది ఎకరాలు ఉండాలి. అయినా డబ్బులు చెల్లించేశారు.
అన్నింటికీ కామన్ గా ఒక షరతు పెట్టుకుంటున్నారు. అదేమిటంటే.. ఏమైనా వివాదాలు వస్తే ఆయా కంపెనీలపై కేసులు పెట్టడానికి లేదు. వారి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే న్యాయపరిధిలోకి వస్తాయని షరతు పెడుతున్నారు. అంటే.. వాళ్లు తప్పు చేసినట్లుగా తేలినా కేసులు వాళ్ల దగ్గరకే వెళ్లి వేయాలి. ఇది ఎందుకు పెడుతున్నారో.. దీని వెనుక ఎలాంటి స్కాం ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టేయడానికి అలవాటుపడ్డ వారు…అన్నింటికీ తెగిస్తున్నారు.