దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఇద్దరూ ఇంటి బయట ఆందోళన చేస్తున్న సమయంలోనే ఆమె.. అలా ఇంట్లోకే వెళ్లిపోవడంతో మరోసారి రచ్చ స్టార్టయింది.
నిజానికి దివ్వెల మాధురీ తమకు ఆస్తులేమీ వద్దని చెబుతున్నారు కానీ.. అసలు ఆ ఇంటి చుట్టూనే కథ నడుస్తోంది. పిల్లలకు ఆస్తులు రాసిచ్చేసి ఎసలాగైనా పోవచ్చని దువ్వాడ వాణి చెబుతున్నారు. కానీ.. ఆ ఇంటికి తాను అప్పు ఇచ్చానని తనకు కోట్లు రావాలని మాధురీ చెబుతున్నారు. అంటే.. ఆ ఇంటి వ్యవహారంతోనే ఇప్పుడు ఈ కథ ముడిపడి ఉందన్నమాట. ఇప్పటి వరకూ కుటుంబసభ్యులు చర్చలు జరిపినా.. ఓ అంగీకారానికి రాలేకపోయారు.
ఇప్పుడు దివ్వెల మాధురీ నేరుగా ఇంట్లోనే మకాం వేయడంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా చోటు చేసుకోనుందని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, మాధురీ కలిసి ఆడిన ఆత్మహత్యాయత్నం నాటకం ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి. ముందు ముందు వీడియోలు కూడా వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.