సినిమా అంతా హీరోల చుట్టూనే తిరుగుతుంది. కానీ హీరోయిన్లు కూడా ఇంపార్టెంటే కదా?? హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంటేనే కథ పండేది. కనీసం పాటలైనా చూడబుల్‌గా ఉండాలంటే అందమైన కథానాయికల్ని ఎంచుకొని తీరాల్సిందే. ఇటీవల విడుదలైన తిక్క, ఆటాడుకుందాం రా, చుట్టాలబ్బాయి సినిమాలు ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. ఈ మూడు సినిమాల్లో కనిపించిన కామన్ విషయం.. కథానాయిక మైనస్. కథానాయికల్ని ఎంపిక చేసుకోవడంలో మనవాళ్లు ఎన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారో ఈ హీరోయిన్లని చూస్తే అర్థమైపోతుంది. తిక్కలో కథానాయికగా నటించింది లారిస్సాబొనేసి. చూడ్డానికి అమ్మడు కలర్‌ఫుల్‌గానే ఉంది. కానీ.. తెరపై మాత్రం హావభావాలు పలకడంలో శూన్యం. సాయిధరమ్‌తో సమానంగా స్టెప్పులు వేయడానికి కూడా బాగా ఇబ్బంది పడింది. చుట్టాలబ్బాయిలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది నమిత ప్రమోద్. ఆది పక్కన లక్కపిడతలా ఉంది. గ్లామర్, నటన ఈ రెండు విషయాల్లో నమితకి మైనస్ మార్కులే. అసలు ఆమెకు లిప్ సింకే కుదర్లేదు.
ఇక ఆటాడుకుందాంరాలో సుశాంత్ పక్కన నటించిన సోనమ్ ప్రీత్ బాజ్వా అయితే మరీ పూర్. ఎడా పెడా ఎక్స్పోజింగ్ చేసేసింది గానీ.. జనమే చూళ్లేకపోతున్నారు. పైగా కాస్త ఒళ్లుగానూ ఉంది. తెలుగు అస్సలు రాదేమో.. భాష విషయంలో చాలా ఇబ్బంది పడినట్టు ఆమె డైలాగులు పలుకుతున్న విధానం చూసి అర్థం చేసుకోవొచ్చు. మూడు సినిమా ఫలితం ఒక్కటే. మూడింట్లోనూ హీరోలు మైనస్సే. కాస్త ఒడ్డూ పొడవూ అందం చందం ఉన్న హీరోయిన్లను తీసుకొన్నా… ఈసినిమాలు హిట్టయిపోవు గానీ.. కాస్తలో కాస్తయినా బెటర్‌గా ఉండేవేమో? వీళ్లకు మళ్లీ తెలుగునాట అవకాశాలొస్తాయా?? అంత సాహసం ఎవరు చేస్తారో??