నాయకుడు సమర్థుడైతే కష్టకాలంలో కూడా సానుకూల వాతావరణమే ఉంటుంది… గెలుస్తామన్న నమ్మకం ఉంటుంది. భవిష్యత్ పై ఆశలు గెలుపు కోసం పనిచేసేలా చేస్తాయి. ఏపీలో మొన్నటి వరకు ఎటూ చూసిన అప్పుల ఊబి… కొత్త అప్పుల కోసం వెతుకులాటే తప్పా భవిష్యత్ పై బెంగే తప్పా అంతా ఆగమ్యగోచరం.
ఒకటో తారీఖు వస్తుందంటే చాలు… ఆర్థికశాఖ అధికారులు తల పట్టుకునే వారు. ఏది తనాఖా పెట్టాలి, ఎక్కడ అప్పు తేవాలి, ఎవరిని కలిస్తే అప్పు పుడుతుంది ఇదే ఆలోచన.
కానీ, చంద్రబాబు నెల రోజుల పాలనలో అప్పుల బాధ వేధిస్తున్నా… అధిగమిస్తామన్న నమ్మకం మొదలైంది. ఇన్వెస్టర్స్ వస్తే… రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. అందుకే సీఎం చంద్రబాబు… వచ్చీ రాగానే శాంతిభద్రతలపై ఫోకస్ చేసి, ఏపీ అంటే బీహార్ కాదు… పోలీసు వ్యవస్థ పక్కాగా పనిచేస్తుందన్న మెసెజ్ పంపించారు. ఆ తర్వాత పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న భరోసా ఇస్తూ నెలలో రెండు రోజులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఇక అన్నింటికన్నా కీలకం… ఇన్వెస్టర్స్. భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద రివ్యూ పెట్టడమే కాదు కొత్త ఎయిర్ పోర్టుల గురించి మాట్లాడి రాష్ట్రంలో రియల్ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా పునాదులు వేశారు. మెడ్ టెక్ జోన్ వద్ద మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పటమే కాదు సీఐఐ సదస్సును విశాఖకు రమ్మని ఆహ్వానించటం… అమరావతిలో ప్రత్యేకంగా స్థలం ఇస్తామని మాటివ్వటం పాజిటివ్ వాతావరణాన్ని కల్పించాయి.
ఇలా నెల రోజుల్లో అప్పుల బాధ ఉన్నా… భవిష్యత్ పై భరోసా ఇవ్వటంలో సీఎం చంద్రబాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీనికి రాబోయే బడ్జెట్ మరింత కీలకం కాబోతుంది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకరాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ గోల్ తో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టబోతున్నట్లు స్పష్టం అవుతుంది.