అక్కలారా.. అమ్మలారా… అయ్యలారా… మీ బిడ్డ ఎంత చదువుకున్నా డబ్బులు నేనే కడతానని తన చేతిలో డబ్బులు కడతానన్నట్లుగా బిల్డప్పులు ఇచ్చి ఓట్లు పొందిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. ఇంత మోసమా అని నోళ్లు నొక్కుకోవాల్సి ఉంటుంది. పేదలు.. బడుగు, బలహీనవర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లను తగ్గించి.. ఆ సీట్లను జగన్ రెడ్డి లక్షలకు అమ్ముకోవాలని డిసైడయ్యారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ కడుతున్నామని హడావుడి చేసినా… కేవలం ఐదు మెడికల్ కాలేజీలకు మాత్రమే ఈ ఏడాది కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చింది. ఒక్కో దాంట్లో నూట యాభై మెడికల్ సీట్లు భర్తీ చేసుకోవచ్చు. అంటే ఏడువందల యాభై అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో జాతీ కోటా కింద పదిహేను శాతం వెళ్తాయి. మిగిలిన సీట్లలో సగం సీట్లను అమ్మకానికి పెట్టేసింది. బడుగు,, బలహీన వర్గాలకు కూడా ఇరవై లక్షల వరకూ ఫీజులు నిర్ణయించింది. ఇందు కోసం రిజర్వేషన్ల కోటా మార్చింది. దీంతో బలహీనవర్గాలు, పేదలు వైద్య విద్య అవకాశాల్ని కోల్పోతారు.
ఇలా ఫీజులు నిర్ణయించడానికి ఇవేమీ ప్రైవేటు కాలేజీలుకాదు. ప్రజాధనంతో కడుతున్న ప్రభుత్వ కాలేజీలే. తెలంగాణలో ఇరవైఐదులేజీల్ని ప్రారంభించారు.. ఎక్కడా లక్షల్లో ఫీజులు వసూలు చేయడం లేదు. రూ. పదిహేను వేలు మాత్రమే ఫీజు. కానీ ఏపీలో మాత్రంకొత్త మెడికల్ కాలేజీల్లో విద్యార్థులను దోపిడీ చేయాలని నిర్ణయించారు. స్థోమత లేని వారికి వైద్య విద్య అక్కర్లేదన్నట్లుగా మార్చేశారు. పేదలు,, పెత్తందారులంటూ మాటలు చెప్పే పాలకుడి తీరు ఇది.