సోషల్ మీడియాలో.. కొత్త తరానికి ఎప్పటికప్పుడు… న్యూస్.. ఎనాలసిస్ అందిస్తూ… వారి ఆదరణను చూరగొనడంలో తెలుగు360 దూసుకెళ్తోంది. భారతదేశానికి సంబంధించినంత వరకూ ట్విట్టర్లో జాతీయ మీడియా సంస్థలు సైతం అందుకోలేనంత ఎత్తులో తెలుగు360 నిలిచింది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఆక్సఫర్డ్ – రాయటర్స్ కలిపి చేసిన స్టడీలో.. ఈ విషయం వెల్లడయింది. ట్విట్టర్లో రీడర్స్ ఎంగేజ్మెంట్ విషయంలో.. ఇండియాలో.. టాప్ సిక్స్ స్థానంలో తెలుగు360 నిలిచింది. ప్రసిద్ధ ఇంగ్లిష్ వెబ్ సైట్ దవైర్ తర్వాతి స్థానం….తెలుగు360 దే. అన్ని వార్తా సంస్థల వార్తలనూ… ఇచ్చే డైలీ హంట్ స్థానం కూడా తెలుగు360 తర్వాతే.
ఇప్పుడు… ప్రపంచ మీడియా సంధి దశలో ఉంది. సంప్రదాయ మీడియా అయిన… దినపత్రికలు, ఎలక్ట్రానిక్ టీవీ చానళ్ల హవా..శరవేగంగా తగ్గిపోతోంది. ఇప్పుడు.. నవతరం…. నవతరమైన ఆలోచనలతో ఉన్న మీడియానే ప్రొత్సహిస్తున్నారు. సోషల్ మీడియాలో శరవేగంగా.. వార్తలు, విశ్లేషణలు అందించే మీడియాకే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ విషయాన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు గుర్తించినా… తదనుగుణంగా… ముందుకెళ్లలేకపోతున్నాయి. అయితే.. ఆయా సంస్థలకు ఉన్న ప్లస్ పాయింట్లేమీ లేకపోయినా.. కేవలం యువతరం అభిరుచుల్ని గుర్తించగలిగిన సామర్థ్యంతో పరిమిత వనరులతోనే మేము చేస్తున్న ప్రయత్నం… అందర్నీ అభిమానించేలా చేస్తోంది. విశ్వసనీయతో ఇస్తున్న వార్తలు, విశ్లేషణలు… వేగం… సోషల్ మీడియా రేంజ్‌కి తెలుగు360 అందుకోవడంతోనే ఇది సాధ్యమవుతోంది.
వివక్ష లేని విశ్లేషణలు వార్తలను కొత్తతరం పాఠకులకు అందించాలన్న లక్ష్యంతో… ప్రారంభించిన తెలుగు360 ఎప్పుడూ.. రాజీపడలేదు. అందుకే.. అనతికాలంలోనే… ఇంకా చెప్పాలంటే.. చాలా స్వల్ప కాలంలోనే… అత్యంత భారీగా నడిచే మీడియా సంస్థల కన్నా ఎక్కువ విశ్వసనీయత సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న సోషల్ మీడియా సామ్రాజ్యంలో తెలుగు360 తనదైన ముద్రవేస్తోంది. దేశంలోనే ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నమ్మకాన్ని మరింతగా పెంచుకుని.. మరింత బాధ్యతగా….. న్యూస్‌ని.. ఎనాలసిస్ను అందిస్తాం.