ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ప్రైజ్ అపార్టుమెంట్ల చుట్టూ తిరుగుతోంది. కొనుగోలుదారులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా బిల్డర్లు చిన్న చిన్న అపార్టుమెంట్లు కట్టడాన్ని నమోషీగా ఫీలవుతున్నారు. భారీ ప్రాజెక్టలతో మార్కెట్ ను కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. నలభై,యాభై, అరవై అంటూ ఆంతస్తులు పెరిగిపోతున్నాయి. పైకి వెళ్లే కొద్దీ రేట్లు ఎక్కువగా చేసి అమ్ముతున్నారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి అపార్టుమెంట్లు పెరుగుతూండటంతో ఎక్కడ నివసిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మెల్లగా అర్థమవుతోంది.
ప్రైజ్ అపార్టుమెంట్లలో ఉండే వారికి పైకి వెళ్లే కొద్దీ.. సమస్యలు పెరుగుతున్నాయని చాలా మంది ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇరవై అంతస్తుల వరకూ పర్వాలేదు కానీ అంత కన్నా ఎక్కువగా వెళ్తే ఊహించని సమస్యలు వస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా గాలి సమస్య. కింద అంతస్తుల్లో కన్నా పై అంతస్తుల్లో వపరీతమైన గాలి ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకపోవడం వల్ల నేరుగా గాలి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది. దాంతో పాటు దుమ్మూ, ధూలి సహజమే. స్వచ్చమైన గాలిని సిటీలో అయినా..సిటీ బయట అయినా ఆశించడం కష్టమే. హోరుగాలి అయితే భరించడం కష్టం.
ఇక లిఫ్టుల వద్ద పడిగాపులు ఆడాల్సిన పరిస్థితి. ఎంత వేగవంతమైన లిఫ్టులు పెట్టినా ఒకే సారి అందరూ ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే సమయానికి బయటకు వస్తారు. అప్పుడు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. అలాగే చాలా ఎప్పుడు ఎలాంటి అవసరానికి కిందకు రావాలన్నా సమస్యలే. అత్యంత ఎత్తులో ఉండటం మొదట్లో ధ్రిల్లింగ్ గా ఉంటుంది కానీ అది రాను రాను బోర్ గా మారుతుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై అంతస్తులోపు అయితే మంచిదని సలహాలు ఇస్తున్నారు.