నటుడు విజయ్ ఆత్మహత్య విషయం బయటకు పాకి 24 గంటలు గడిచాయో లేదో, ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది.. తిరుగుతోంది. మొదట్లో ఆర్థిక కారణాల వల్ల విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నారు. ఆ తరవాత.. భార్య ప్రమేయం బయటకు వచ్చింది. విజయ్‌కి ఎయిడ్స్ ఉందన్నది కొత్త కోణం. ఇప్పుడు మరోటి బయట పడింది. వినీత తల్లికీ, రఫీ అనే ఓ వ్యక్తికీ వివాహేతర సంబంధం ఉందని, ఆ వ్యక్తికీ విజయ్ ఆత్మహత్యకూ లింకు ఉందన్నది పోలీసులు బయట పెట్టిన సరికొత్త విషయం. వినీత అసలు పేరు వరలక్ష్మి అని, ఆమె 10వ తరగతి సర్టిఫికెట్లో ఓ పేరు, పాస్ పోర్టులో మరో పేరు ఉందనీ, తండ్రుల పేర్లు కూడా వేర్వేరుగా ఉన్నాయని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. రఫీ కీ విజయ్‌కీ గత కొంతగాలంగా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయని, అందుకు వినీత కూడా ఓ కారణమని భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు విజయ్ సాయి పోస్టు మార్టం కూడా పూర్తయింది. నివేదిక ఇంకా రావాల్సివుంది. ఆ రిపోర్ట్ బయటకు వస్తే.. విజయ్‌కి హెచ్ ఐ వీ ఉందా? లేదా? అనే విషయాలు తెలుస్తాయి. విజయ్ సెల్ఫీ వీడియోని సూసైడ్ నోట్‌గా తీసుకున్న పోలీసులు, అందులో విజయ్ ప్రస్తావించిన వాళ్లందరికీ నోటీసులు పంపారు. ఈ జాబితాలో రఫీ పేరు కూడా చేర్చినట్టు తెలుస్తోంది.