భారత లార్డ్స్ ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టులో కోహ్లీ సేన ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. పింక్ టెస్ట్‌లో మొదటి సెషన్ నుంచే వార్ వన్ సైడ్‌గా మారిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ.. బంగ్లాదేశ్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు .. నిప్పుల్లా విసురుతున్న పింక్ బాల్స్ ను ఎదుర్కోవడం.. బంగ్లా బ్యాట్స్ మెన్ వల్ల కాలేదు. రెండో రోజే టెస్ట్ ముగిసేది.. అయితే ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా.. గట్టిగా పోరాడి.. పరాజయాన్ని .. మూడో రోజుకు పరాజయాన్ని తీసుకెళ్లగలిగారు.
ఈడెన్ టెస్టు మొత్తాన్ని ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లు శాసించారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ ఐదు వికెట్లు తీయగా… రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్.. తొలి ఇన్నింగ్స్‌లో మూడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు తీశాడు. ఇద్దరూ కలిసి.. మొత్తం ఇరవై వికెట్లలో… పదిహేడు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌కు.. పింక్ బాల్ అమితంగా సహకరించింది. పేస్, స్వింగ్ రెండూ కలసి రావడంతో..భారత బౌలర్లకు తిరుగులేకుండా పోయింది. మరో టెస్ట్ మిగిలి ఉండగానే.. భారత జట్టు సిరీస్ చేజిక్కించుకుంది.
ఇండియా ఆడిన తొలి డే అండ్ నైట్ టెస్టుగా మాత్రమే కాకుండా.. రికార్డుల పరంగా కూడా.. ఈ మ్యాచ్.. చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్ తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అంతేకాదు, భారత జట్టుకు వరుసగా ఏడు టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 33 టెస్టుల్లో విజయం సాధించింది. స్వదేశంలో వరుసగా 12 టెస్టు సిరీస్ విజయాలు అందుకుని మరో రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకు ెక్కాడు. తొలి స్థానంలో సచిన్ ఉన్నాడు. కెప్టెన్‌గా 5000 పరుగులు చేసిన ఆటగాడు ఒక్క కోహ్లీనే.