ఎక్కడ ఏం స్పైసీ వార్తలు దొరుకుతాయో, ఎలా గాసిప్పులు పుట్టించాలో అని ఎదురుచూసే గాసిప్ రాయుళ్ళకు కావాల్సినంత మసాలా అందించాడు రాజ్‌తరుణ్. హీరోయిన్ హెబ్బా పటేల్ పై తనకున్న అభిమానమో, ఇష్టమో ప్రకటించే క్రమంలో ఓ స్పైసీ కామెంట్ కొట్టేశాడు.
కుమారి 21 ఎఫ్ లో జంటగా కనిపించారు రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌కీ మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఇద్దరి మధ్యా స్నేహం చిగురించింది. ఈ కాంబినేషన్ ని ఈడోరకం – ఆడోరకంలో రిపీట్ చేశారు. ఇప్పుడు అంధగాడు తో ముచ్చటగా మూడో సారి ఈ జంట స్క్రీన్ పంచుకుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ పై తన మనసులో మాట బయటపెట్టాడు రాజ్ తరుణ్. హెబ్బా పటేల్ తో నటించడానికి తనకు చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటుందని, హెబ్బాతో వుంటే బోర్ కొట్టదని, ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుందని ఓపెన్ అయ్యాడు రాజ్ తరుణ్.
రాజ్ తరుణ్- హెబ్బా మధ్య సంథింగ్ సంథింగ్ ఇప్పటికే టాక్ వుంది. ఇప్పడు రాజ్ తరుణ్ మాటలు గాసిప్ రాయుళ్ళకు మరింత సాల్ట్ అదించినట్లయింది.