త్వరలోనే సాహోలో కొత్త సీన్లు కలవబోతున్నాయి. అవి ఒకటా, రెండా? అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సివుంది. సాహో నిడివి దాదాపు 2 గంటల 50 నిమిషాలు. ఈ సినిమాలో కత్తిరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రిమ్ చేసినా లాభం లేదు. చూడాల్సిన వాళ్లు చూసేశారు. వాళ్లని మళ్లీ థియేటర్లకు రప్పించాలంటే మాత్రం ఏదో ఒకటి చేయాలి. అందుకే సాహో టీమ్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈసినిమాలో కొత్త సన్నివేశం జోడించాలని భావిస్తోంది. ద్వితీయార్థంలో ఓ యాక్షన్ సీన్‌కి ముందొచ్చే ఇంట్రో సీన్ అది. ఆ సీన్‌కి ముందు ప్రభాస్ ఇంట్రడక్షన్ ఓ రేంజ్లో ఉంటుందట. సినిమా నిడివి ఎక్కువైందని ఆ సీన్‌ని ట్రిమ్ చేశారు. ఇప్పుడు అదే సీన్‌ని కొత్తగా జోడించాలని చూస్తున్నారు. మంగళవారం నుంచి సాహో వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ వీకెండ్ కొత్త సినిమాలేం లేవు. సినిమా ప్రేమికులకు సాహోనే ఏకైక ఆప్షన్. ఇలాంటి దశలో సాహోలో కొత్త సీన్లు జోడిస్తే వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.