వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. పోలీసులు మళ్లీ కొత్త గా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. హత్య జరిగినప్పుడు.. ప్రభుత్వం ఓ సిట్‌ను నియమించింది. పది వరకూ ప్రత్యేక బృందాలతో… అణువు అణువూ గాలించి… దర్యాప్తు చేశారు. అయితే.. కేసులో ఉన్న సంక్లిష్టతలు…. సీబీఐకి ఇవ్వాలన్న జగన్ కుటుంబసభ్యుల పిటిషన్ల మేరకు… ఆ తర్వాత విచారణ మందగించింది. చివరికి హైకోర్టు.. మీడియాకు వివరాలు చెప్పవద్దని పోలీసులకు ఆదేశించడంతో.. ఆ కేసు అంతటితో ఆగిపోయింది. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. వైసీపీ గెలిచింది. జగన్ సీఎం అయ్యారు.
ఏపీ పోలీసులపై నమ్మకం లేనే లేదని.. ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సీబీఐ విచారణ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు.. నిర్ణయాధికారం.. తన చేతుల్లోనే ఉంది. సీబీఐకి కేసును సిఫార్సు చేస్తే.. వెంటనే.. సీబీఐ అధికారులు రంగంలోకి దిగి.. తన బాబాయ్ అయిన… వివేకానందరెడ్డి హత్య కేసును చేదిస్తారు. ఇప్పుడు.. తన చేతుల్లోనే పోలీసులు ఉంటారు కాబట్టి.. వారిపై నమ్మకం ఉంటే.. చేయగలిగినదంతా .. చేయవచ్చు. అందుకే.. ఇప్పుడు.. కొత్తగా సిట్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఈ సిట్‌కు కడప జిల్లా ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతినే నేతృత్వం వహిస్తారు.
వివేకా హత్య కేసులో పోలీసులు అవసరమైన ప్రాధమిక సాక్ష్యాధారాలన్నీ సేకరించారు. మర్డర్ జరిగిన ప్రదేశంలో… సాక్ష్యాలను తుడిచిపెట్టినట్లు.. స్పష్టంగా ఉండటంతో.. దానికి కారణంగా.. ముగ్గుర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారిస్తే… కేసు చిక్కుముడి మొత్తం విడిపోతుంది కానీ.. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ హత్య కేసులో.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపైనే విమర్శలు చేశారు. కాబట్టి.. ఇప్పుడు.. ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నందున.. తన అనుమానాలను నివృతి చేసుకోవడానికి అవసరమైన సందర్భం వచ్చినట్లే భావించారు. మరి ఈ సిట్… వివేకా హత్య కేసును కొలిక్కి తెస్తుందా.. లేక… కోల్డ్ స్టోరేజీలో పడేస్తుందా.. అన్నది వేచి చూడాలి..!