సజ్జల సేవలకు జగన్ ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారా? అందుకే సోషల్ మీడియా బాధ్యతలను తన బంధువులకు అప్పగించారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు అనేకం. అందులో సోషల్ మీడియా అతి, సజ్జల సలహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పంథాలో కొనసాగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. గత ఐదేళ్లు సజ్జల డైరక్షన్ లో సాగినా ఫలితం తేడా కొట్టడంతో జగన్ , సజ్జల కుమారుడు భార్గవ్ నేతృత్వంలో కొనసాగే సోషల్ మీడియాలో కొత్త వ్యక్తిని, తన బంధువును తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది.
యశ్వంత్ రెడ్డి …ఈయన ఎవరో కాదు. విజయమ్మ సోదరుడి అల్లుడు. ప్రస్తుతం సజ్జల భార్గవ్ తోపాటు యశ్వంత్ కూడా సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తారని అంటున్నారు. భార్గవ సలహాలతోనే యశ్వంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయని అంటున్నా… ఇప్పటికిప్పుడు జగన్ బంధువును తెచ్చి పెట్టడం వెనక జగన్ ప్లాన్ ఏమై ఉంటుందని చర్చ జరుగుతోంది.
సజ్జల భార్గవ్ నేతృత్వంలోనే సోషల్ మీడియా కొనసాగుతుందని అంటున్నా ..యశ్వంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారంటే.. సజ్జల భార్గవ్ ను తప్పించే ఉద్దేశం ఉండవచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి.