సినిమా అంటే ఓ హీరో.. ఓ హీరోయిన్.. ఓ విలన్ ఇలాంటి ప్రమాణాలన్ని ఉండటం పాతవి.. ఇప్పుడు సినిమాలంటే హీరోనా అవసరమా.. విలనా.. ఏ దెయ్యాన్నో, భూతాన్నో పెట్టేస్తే పోలా అనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. హాలీవుడ్ సినిమాల ప్రభావం కావొచ్చు.. డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తపన కావొచ్చు కొత్త థోరణిలో ఆలోస్తున్నారు కథా రచయితలు, దర్శక నిర్మాతలు. ఆ కోవలోనే ప్రస్తుతం చిన్న బడ్జెట్ లోనే సినిమాలు తీస్తూ హిట్ కొట్టేస్తున్నారు. అది కూడా హారర్ కామెడీ.. ఉంటే హారర్ ఉండాలి.. లేదా కామెడీ ఉండాలి.. కాని దర్శకులు ఈ రెండిటిని మిక్స్ చేసి సినిమాలు చేస్తున్నారు.
సినిమాలో కామెడీ టీంని ఉంచి.. సినిమాలో సన్నివేశాలతో భయపెడుతూనే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఈ జానర్లో వచ్చిన సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. సినిమా హీరో స్టారా కాదా.. హీరోయిన్ స్కిన్ షో చేస్తుందా లేదా అనేవి ఏమీ పట్టించుకోకుండా.. సినిమాలో లీనమయ్యే సస్పెన్స్ త్రిల్లింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తే వాటిని ఆదరిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో అలాంటి జానర్లో వచ్చిన రాజు గారి గది, త్రిపుర సినిమాలు ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి.
సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ కాకపోవడంతో సినిమాలు యావరేజ్ గా నిలిచినా సరే మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయని ఇలాంటి సినిమాలను తీయడానికే ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి టాలీవుడ్లో నడుస్తున్న ఈ నయా ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు కాని రెగ్యులర్ బోరింగ్ సినిమాల తాకిడి నుండి ఆడియెన్స్ ఇలాంటి సినిమాలు చూసి కాస్త రి ఫ్రెష్ ఫీల్ అవుతున్నారన్నది అసలు విషయం. అందుకే కథలో రాజకుమారి ఉంటే సూపర్ హిట్ అన్నట్టే అన్నమాట.