కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అఘోరి గురించే చర్చ. ఎక్కడి నలుగురు కూర్చొన్నా ఇదే చర్చ. శ్రీవర్షిణితో అఘోరి జర్నీ హాట్ టాపిక్ అవ్వగా.. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి మరో మహిళ ఎంట్రీ ఇచ్చేసింది. అఘోరియే తన మొదటి భర్త అంటూ మీడియా ముందుకు రావడంతో అఘోరి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
శ్రీవర్షిణిని పెళ్లి చేసుకునేందుకుగాను..గత నెలలో తన వద్దకు వచ్చి మెడలో ఉన్న తాళిని తీసుకొని వెళ్లిపోయాడని మహిళా పేర్కొంది. తనతో అఘోరి గతంలో మాట్లాడిన కాల్ ను బయటపెట్టింది. ఇది వైరల్ కావడంతో అఘోరి స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన రాధ ఓ లాయర్. ఆమెకు మ్యారేజ్ అయిందని, ఆమె భర్త మరో మహిళతో వెళ్లడంతో మానసికంగా కుంగిపోయింది. ఆ సమయంలో తనకు ఫోన్ చేసి తన భవిష్యత్ ను కాపాడాలని కోరిందని అఘోరి చెప్పింది. తనను ఫోన్ కాల్ లో అప్రోచ్ అయిన తర్వాత తాను కలిసానని, తనకు నాతో పెళ్లి జరిగిందని ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. ఆమెకు తాళి కట్టినట్లు అబద్దాలు చెబుతోందని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని చెప్పింది. తను విడుదల చేసిన ఆడియోలో ఐ లవ్ యూ.. మిస్ యూ అన్నట్లు ఉందని, అది నేను కామన్ గా ఉపయోగించే పదమని వివరణ ఇచ్చింది.
ఈ ఇష్యూ మరింత పెద్దగా అవుతోంది. అటు శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఆమె తమ వద్దకు వచ్చేయాలని కోరుతున్నారు. అఘోరిమాత పేరిట శ్రీవర్షిణిని ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీవర్షిణి జీవితంతో అఘోరి ఆడుకుంటుందని, తమ కూతురిని అఘోరి చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు. కానీ, శ్రీవర్షిణి అఘోరితోనే తుది శ్వాస వరకు ఉంటానని ఖరాఖండిగా చెబుతోంది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ఓ మహిళను ఇదివరకు అఘోరి పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దీంతో దేవదూత ముసుగులో అఘోరి మహిళలను ట్రాప్ చేస్తోందనే ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతోంది. అందుకే ఇక ఈ విషయంలో స్వామీజీలు లీడ్ తీసుకొని , అఘోరి చేస్తున్న వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్లు వస్తున్నాయి.