జగన్ రెడ్డి సీఎం కావాలని పెద్ద స్కెచ్ వేసి తాను అనుకున్న ఎఫెక్ట్ సాధిచిన కోడికత్తి శీను ఐదేళ్లుగా జైల్లో ఉన్నారు. జగన్ రెడ్డి .. కోడికత్తి శీను ఆశించినట్లుగా బంపర్ మెజార్టీ సాధించి సీఎం అయ్యారు. కానీ శీనుకు మాత్రం చిప్పకూడే గతయింది. ఐదేళ్లుగా ఆయనకు బెయిల్ ఎందుకు రాలేదు అంటే.. జగన్ రెడ్డే రానీకుండా చేస్తున్నారని శ్రీను తరపు లాయర్ ఖరాఖండిగా చెబుతున్నారు. సీఎం జగన్ విచారణకు సహకరించాలని.. కోర్టుకు హాజరుకావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అంటున్నారు. జగన్ NOC అయినా ఇవ్వాలి, వాదనలైనా వచ్చి వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని.. రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారన్నని ఆయన అసహనం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది సలీం అనుమానం వ్యక్తం చేశారు. కోడికత్తి శీను తల్లిదండ్రులు జగన్ రెడ్డిని వేడుకోని సందర్భం లేదు కానీ జగన్ రెడ్డి మనసు కరగలేదు. ఆ ఘటనతో తనకు సానుభూతి తెచ్చిపెట్టడమే కాకుండా… తనకు దొంగవైద్యం చేసిన డాక్టర్లకు పదవులు కూడా ఇచ్చారు.కానీ అసలు మొత్తం ఎపిసోడ్ నడిపించిన వ్యక్తి దళితుడు, సామాన్యుడు కాబట్టి జగన్ రెడ్డి దయ చూపడం లేదంటన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బలి పశువుగా కోడికత్తి శీను వ్యవహారాన్ని వాడుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విచారణను వేగవంతం చేసి.. కేసును ముగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శ్రీను తరపు లాయర్లు చెబుతున్నారు. కానీ జగన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి సహకారం లేకపోతే.. కేసు ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు.