కారుకు ప్రమాదం చేసి..పారిపోయిన రాజ్‌తరుణ్ బాగోతం బయటపడింది. ఈ నటుడు ఫుల్లుగా మందుకొట్టి..కంట్రోల్ తప్పిపోయిన..కారు యాక్సిడెంట్ చేసినట్లుగా వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. నార్సింగి సమీపంలోని అల్కాపురి కాలనీ వద్ద.. ..రోడ్డు పక్కన ఉన్న గోడను వోల్వోకారుతో ఢీకొట్టి…తర్వాత కారును అక్కడ వదిలేసి..పరారయ్యాడు.. రాజ్ తరుణ్. ఆయన పారిపోతున్న దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎవరూ గాయపడనప్పుడు… రాజ్‌తరుణ్ ఎందుకు పరారయ్యాడనేది.. చాలా మందికి అర్థం కాలేదు. అయితే.. ఆయన మద్యం తాగి ఉన్నారని… పోలీసులు పట్టుకుంటారన్న ఉద్దశంతోనే కారును అక్కడే వదిలేసి పరారయ్యారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి తగ్గట్లుగానే రాజ్ తరుణ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పోలీసులు కేసు నమోదు చేయడంతో… ఓ వీడియో మాత్రం విడుదల చేశారు. అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని నీతులు చెప్పారు. కానీ.. రాజ్ తరుణ్.. మద్య తాగి ఉన్నాడని.. ప్రమాదం జరిగిన సమయంలో.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. పారిపోతున్న రాజ్ తరుణ్ దృశ్యాలను కూడా.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. తాను మద్యం తాగి ఉన్నానని.. వీడియో డిలేట్ చేయాలని చెప్పి.. పరారయ్యాడు. ఆ దృశ్యాలను డిలీట్ చేసేందుకు.. రూ. ఐదు లక్షలు ఆఫర్ ఇచ్చాడని..సదరు వ్యక్తి మీడియాకు సమాచారం ఇచ్చి… దృశ్యాలను కూడా.. ఇచ్చారు. దాంతో.. రాజ్ తరుణ్ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు ఇప్పటికే న్యూసెన్స్ కేసు పెట్టారు. ఇ్పుడు… ఎలాంటి కేసు పెడతారో మరి..!
ప్రమాదం జరిగిన సమయంలో… ఇంకో నిర్మాత ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే.. అలాంటిదేమీ లేదని… వీడియోలో కనిపిస్తోంది. రాజ్ తరుణ్ ఒక్కరే ఉన్నారు. ఆయనే డ్రైవింగ్ చేస్తున్నారు. కారు కూడా.. రాజ్ తరుణ్ పేరు మీద లేదు. దాంతో పోలీసులు… మొదట కేసు పెట్టడానికి సంశయించారు. చివరికి… తానే డ్రైవ్ చేశానని.. వీడియో రిలీజ్ చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు.. మద్యం తాగినట్లుగా ఒప్పుకున్న అంశం కూడా.. పోలీసులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.