మంచు విష్ణు ఆఫీసులో దొంగతనం జరిగిందనీ, సుమారు రూ.5 లక్షలు విలువగల మేకప్ సామాగ్రి కనిపించకుండా పోయిందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ దొంగతనం కేసులో నాగశీను అనే హెయిర్ స్టైలీష్ ప్రధాన నిందితుడు. తమ అనుమానం నాగ శీనుపైనే ఉందని.. విష్ణు మేనేజర్ ఆరోపించారు. పోలీసులు నాగశీనుని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నాగ శీను వాదన మరోలా ఉంది. తను అసలు దొంగతనం చేయలేదని, తననే మంచు మోహన్ బాబు, విష్ణు కులం పేరుతో దూషించేవారని, ఓసారి మోకాళ్ల మీద కూర్చోబెట్టారని, అది నచ్చక పని మానేశానని పోలీసుల ముందు చెప్పాడు. అయితే తనపై కక్ష కట్టి ఇలా దొంగతనం కేసు మోపారని శ్రీను చెబుతున్నాడు. దాదాపు పదేళ్ల నుంచీ.. శ్రీను మోహన్ బాబుకి వ్యక్తిగత హెయిర్ స్టైలీషర్గా పనిచేస్తున్నాడు. `సన్నాఫ్ ఇండియా` సినిమాకీ తను వర్క్ చేశాడు. సినిమా పూర్తయినా తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వడం లేదని, జీతం ఆపేశారని, ఈ విషయమై శ్రీను ఎదురు తిరిగాడని, అప్పటి నుంచీ ఉద్యోగం మానేసి వెళ్లిపోయడని మరో వెర్షన్ వినిపిస్తోంది. ఆ కోపంలోనే మోహన్ బాబు, విష్ణు విగ్గుల్ని తీసుకెళ్లిపోయాడని, వాటి విలువ రూ.5 లక్షలని అందుకే…విష్ణు మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేశారని చెబుతున్నారు.