కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసులో.. అనుమానించి.. పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ..ఆయన రాసిన లేఖలను… శ్రీనివాసులరెడ్డికి వైద్యం చేసిన డాక్టర్లు.. పోలీసులకు అందించారు. నిజానికి శ్రీనివాసులరెడ్డి పేరు ఇంత వరకూ వైఎస్ వివేకా హత్య కేసులో బయటకు రాలేదు. అనుమానితుడిగా ఉండి.. నార్కో పరీక్షలు ఎదుర్కొన్న పరమేశ్వర్‌రెడ్డికి సమీప బంధువుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమలో నార్కో పరీక్షలు నిర్వహించిన తర్వాత… పులివెందుల, జమ్మల మడుగు ప్రాంతాల్లో పలువురు అనుమానితుల్ని.. పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీనివాసులరెడ్డిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీన్నే అవమానంగా భావించి.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా… శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా… శ్రీనివాసులరెడ్డి.. తన సూసైడ్ నోట్లో రాసినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖ రాశాడు. సీఐ రాములు గురించి లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు, గంగిరెడ్డి, శేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి లకు నార్కో పరీక్షలను గుజరాత్లో నిర్వహించారు. వాటి ఆధారంగానే ఇప్పుడు… పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత హత్య కేసు విచారణకు.. కొత్త బృందాన్ని నియమించారు. కేసును ఓ కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో… ఆ బృందం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో.. ఇప్పటి వరకూ.. అనుమానితునిగా లేని… వ్యక్తి… హఠాత్తుగా.. ఆత్మహత్య చేసుకోవడం.. అదీ కూడా.. పోలీసులు విచారణకు పిలిచినందుకే… ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం ప్రారంభం కావడం … ఆసక్తి కలిగిస్తోంది. ఇంట్లో ఆత్మహత్యయత్నం చేసుకున్న శ్రీనివాసులరెడ్డి రాశారని చెబుతున్న సూసైడ్ లేఖలు… డాక్టర్లు గుర్తించి.. పోలీసులకు, కుటుంబసభ్యులకు ఇవ్వడం ఈ వ్యవహారంలో మరో కోణం. మొత్తానికి.. వైఎస్ వివేకా హత్య కేసు కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.