వైఎస్ జగన్ రెడ్డి తనపై జరిగిన కోడి కత్తి కేసులో ట్రయల్ జరగకుండా తన అక్రమాస్తుల కేసుల్లాగే కోర్టుల్లో కోర్డు స్టోరేజీలో పడిపోవాలని అనుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులు అంటే.. తను నిందితుడు.. మరి కోడికత్తి కేసులో బాధితుడు.. మరి ఆ కేసును ఎదుకు తేల్చనివ్వడంలేదు. విచారణ జరిగితే అసలు డ్రామా బయటకు వస్తుందనా ?. ఇప్పుడు అదే అసలు టాపిక్. రెండు, మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కోడికత్తి కేసును మరోసారి హైలెట్ చేస్తున్నాయి.
అసలు జగన్ రెడ్డిపై దాడి జరగలేదన్న ప్రచారం ఓ వైపు ఉద్దృతమవుతోంది. కోడి కత్తి అనేది బొత్స మేనల్లుడు తెచ్చారని … ఎయిర్ పోర్టు ఆఫీసర్, సాక్షి దినేష్ కుమార్ కోర్టుకు చెప్పారు. జగన్ రెడ్డికి జరిగిన వైద్యంపై రికార్డులు సీక్రెట్ గా ఉన్నాయి… ఇదంతా పక్కా ప్లాన్డ్ స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఆరోపిస్తున్న కుట్ర లేదని ఎన్ఐఏ చెప్పింది. కానీ ఎన్ ఐఏ చార్జిషీటు ప్రకారం ట్రయల్ చేపడితే రాజకీయ నాటకం మొత్తం బయటకు వస్తుంది. అందుకే విచారణ ఆపడానికి హైకోర్టుకు వెళ్తామని కూడా చెబుతున్నారు. మరింత లోతైన దర్యాప్తు కోసం హైకోర్టుకు వెళ్తామంటున్నారు.
జగన్ రెడ్డి గాయానికి చేసిన లోతైన చికిత్స… నుంచి ప్రారంభిస్తే.. కోడికత్తి కేసు తీగ మొత్తం దొరుకుతుదంని న్యాయనిపుణులు … నేర నిపుణులు అంచనా వేస్తున్నాయి. అసలు జరగని గాయానికి చికిత్స చేసినందుకు ముందు డాక్టర్ ను ప్రశ్నిస్తే.. అసలు ఆ కుట్ర ఎలా జరిగిందో స్పష్టత వస్తుంది. గత ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రెడ్డి వేసిన వేషాలు..ఈ ఎన్నికలకు ముందు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.