రవితేజకు ఈమధ్య కాస్త గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. ‘ధమాకా’ తరవాత ఆయనకు హిట్ లేదు. అయితే… వరుసగా సినిమాల్ని వదులుతూనే ఉన్నారాయన. ఆ పరంపరలో వస్తున్న మరో సినిమా ‘ఈగిల్’. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే… ఆ పోటీ నుంచి కాస్త స్పేస్ తీసుకొని, ఈనెల 9న విడుదల అవుతోంది. ప్రమోషన్లు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి బజ్ కూడా బాగానే ఉంది.
ఈ సినిమా కంటెంట్ ఏమిటి? దర్శకుడు ఏ పాయింట్ ని ఎత్తుకొన్నాడు? అనే విషయం టీజర్, ట్రైలర్లో చెప్పడం లేదు. అది కాస్త సీక్రెట్ గానే ఉంచుతున్నారు. అయితే ఓ బలమైన సామాజిక అంశాన్ని ఈ కథ ద్వారా ప్రస్తావించారని, అలాంటి పాయింట్ ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయలేదని తెలుస్తోంది. చివరి 40 నిమిషాలూ వేరే లెవిల్ లో ఉండబోతున్నాయట. యాక్షన్ సీన్లు, విజువల్స్, స్క్రీన్ ప్లే ట్రీట్ మెంట్ ఇంటర్నేషన్ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం కూడా చెబుతోంది. ఇదో థ్రిల్లర్. క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా రూపు రేఖలే మారబోతున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ ఫైనల్ కాపీ చూసి.. పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన సినిమా ఇది. రవితేజ చివరి హిట్ ‘ధమాకా’ కూడా ఈ సంస్థ నుంచి వచ్చిందే. కాబట్టి సెంటిమెంట్ గా కూడా వర్కవుట్ అవుతుందేమో అని రవితేజ ఫ్యాన్స్ కాస్త ఆశలు పెంచుకొన్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.