సరిగ్గా వంద రోజుల్లో ‘పుష్ష రాజ్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆగస్టు 15న రావాల్సిన సినిమా ఇది. అయితే అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబరుకు వాయిదా పడింది. ఈసారి డిసెంబరు6న ‘పుష్షరాజ్’ రావడం పక్కా. మరో వంద రోజుల్లో ‘పుష్ష రాజ్’ రూలింగ్ మొదలు కానుందన్నంటూ ఓ స్పెషల్ పోస్టర్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.
‘పుష్ష 2’పై ఉన్న అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమా ప్రమోషన్లు కూడా వినూత్నంగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్… విదేశాల్లో చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. దీనిపై సాధ్యాసాధ్యాల గురించి ప్రస్తుతం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబరు 15 నాటికి ఫస్ట్ కాపీ చేతులో ఉంటే, మిగిలిన 15 రోజులు ప్రశాంతంగా ప్రచారం చేసుకోవొచ్చు. ఫారెన్ ట్రిప్ కూడా వేసి రావొచ్చు. కానీ సుకుమార్ అంత టైమ్ ఇస్తాడా? అనేదే ప్రశ్న. సుకుమార్ కు చివరి నిమిషం వరకూ సినిమాని చెక్కడం బాగా అలవాటు. ‘పుష్ష 1’ విషయంలో అదే జరిగింది. చివరి నిమిషం వరకూ టెన్షనే. దాంతో ప్రమోషన్లకు పెద్దగా సమయం చిక్కలేదు. విడుదలైన తరవాత వచ్చిన మౌత్ పబ్లిసిటీ వల్ల, నార్త్ లో ఈ సినిమా క్రేజ్ పెరిగింది. ఆ తరవాత వద్దన్నా.. ఫ్రీ పబ్లిసిటీ వచ్చి పడిపోయింది. అయితే ‘పుష్ష 2’ విషయంలో మాత్రం ప్లానింగ్ చాలా అవసరం. అందుకే ప్రమోషన్లు చేసుకోవడానికి వీలైనంత టైమ్ ఇవ్వాలని నిర్మాతలు సుకుమార్‌ని బతిమాలుతున్నారు. ఇప్పటికున్న ప్లాన్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా భారీగా చేయాలి. అది కూడా ఫారెన్‌లో. ఇది జరగడం, లేకపోవడం పూర్తిగా సుకుమార్ చేతుల్లో ఉంది.