స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాధించిన చెన్నై చందం సమంత కోలీవుడ్లో పరిస్తితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించింది. స్టార్ హీరోల సినిమాల్లో వరుసెంట చాన్స్ కొట్టేస్తున్న అమ్మడు ఇక్కడ అభిమానులకు హాట్ ఫేవరేట్. సమంత అనగానే గుర్తుకు వచ్చేది తనకంటే ముందు తన మధురమైన స్వీట్ వాయిస్.. ఏమాయా చేసావే సినిమా నుండి అదే వాయిస్ తో ప్రేక్షకులను అలరిస్తుంది సమంత. సమంతకు డబ్బింగ్ చెప్పేది చిన్మయి అని తెలిసిందే కదా..
అయితే ఇక నుండి చిన్మయి సాయం తీసుకోకుండా తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పేస్తా అంటుంది అమ్మడు. ఒకవేళ చిన్మయికి, సమంతకు మధ్య మ్యాటర్ ఏమన్నా చెండిందా అంటే అదేం లేదు ఎప్పుడు ఒకరిమీద ఆధారపడటం ఎందుకని సమంత ఇక నుండి తన సినిమాలకు తానే సొంత డబ్బింగ్ చెబుతుందట. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం చేస్తున్న అ..ఆ సినిమా నుండి స్టార్ట్ చేస్తుందని అంటున్నారు.
త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ సమంతతో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి సొంత వాయిస్ తోనే అలరిస్తానని అంటుంది ముద్దుగుమ్మ. ఎలాగు కష్టపడి తెలుగు నేర్చేసుకుంది కాబట్టి డబ్బింగ్ చెప్పడం కష్టతరం కాకపోయినా ఇన్నాళ్లు చిన్మయి వాయిస్ కి అలవాటు పడ్డ అభిమానులు సొంత గొంతుని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.