యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పదవి గండం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. దీనికి కారణం యూపీ. యూపీలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్, ఎస్పీ కూటమి గెల్చుకుంది. ఈ విషయం తెలిసి కూడా మోదీ… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలయిన తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని అక్కడ ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని ఆరోపించారు.
అదే లాజిక్ యూపీకి వర్తించదా అని ప్రశ్నిస్తున్నాయి విపక్ష పార్టీలు. నిజానికి మోదీ వ్యూహం కూడా అదేనని.. యోగి ఆదిత్యనాథ్ సీటుకు గురి పెట్టే ఆ రాజకీయం ప్రారంభించారని అంటున్నారు. దీనికి కారణాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మోదీకి వచ్చే ఎన్నికల నాటికి 80 దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా వారసుడ్ని తెరపైకి తేవాల్సిందే . అయితే ఇంత కాలం చేసిన ఆధిపత్యం కారణంగా అమిత్ షా కన్నా యోగినే ముందుకు వచ్చే అవకాశం ఉంది.
యోగికి 50 సంవత్సరాలు మాత్రమే. ఇది కూడా ఆయనకు కలసి రానుంది. అమిత్ షా కన్నా యోగినే మంచి ప్రధాని అభ్యర్థి అన్న భావన పార్టీలో వస్తే అమిత్ షా అవకాశాలు దెబ్బతింటాయి. యోగికి ఆ ఆలోచన ఉందని గతంలోనే వెల్లడయింది. ఇప్పుడు … అమిత్ షా అవకాశాల్ని మెరుగుపర్చడానికి యోగిని మెల్లగా డౌన్ చేసే వ్యూహం పాటిస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే యోగికి పీఠం కదిలిపోయినా ఆశ్చర్యం లేదని బీజేపీలో అప్పుడే చర్చలు వినిపిస్తున్నాయి.