రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎన్జీటీ నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశంలో అధికారులకు జైలుకు పంపిన సందర్భాలు గతంలో ఉన్నాయా అనే అంశంపై తమకు వివరాలు తెలియచేయాలని పిటిషనర్లను ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటి వరకూ కోర్టు ధిక్కరణ కింద అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులకు నేరుగా జైలుకు పంపే అధికారాలు ఎ్జీటీకి ఉన్నాయా లేక హైకోర్టు ద్వారా పంపాలా అన్న విషయాల్ని కూడా చెప్పాలని పిటిషనర్లను ఎన్జీటీ కోరింది.
తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలు.. ఇతర ఆధారాలను చూసిన తర్వాతే ఎన్జీటీ ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదిక సమర్పించాల్సిన కృష్ణాబోర్డు కమిటీ ఆలస్యం చేసింది. నివేదిక సమర్పించలేదు, కృష్ణాబోర్డు కమిటీ, కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు నివేదికలు సమర్పించలేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తూంటే పనులు భారీగా జరిగాయని అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం.. ఏడో తేదీ నుంచే పనులన్నీ నిలిపివేశామని తెలిపింది. విచారణను ఇవై ఏడో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే రోజు తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఏపీ సర్కార్ సీమ ఎత్తిపోతల ప్రాజెక్టునునిర్మిస్తోంది. పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ, డీపీఆర్ అనుమతి లేదని కృష్ణాబోర్డు ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆదేశించాయి. అయితే ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్‌ను అప్పగించి పనులు చేయిస్తోంది. దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదులు దాఖలు కావడంతో విచారణకు ఆదేశించారు. ఏపీ ప్రభు్తవం మొదట్లో ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించలేదు. కానీ ఎన్జీటీ ఆదేశాలతో కృష్ణాబోర్డు పరిశీలించింది. అయితే నివేదికను సమాత్రం సమర్పించకపోవడం మరింత వివాదాస్పదం అవుతోంది. వచ్చే విచారణ లోపు నివేదిక సమర్పిస్తారని.. అప్పుడు ఎన్జీటీ కీలకమైన ఆదేశాలు ఇస్తుందని అంచనా వేస్తున్నారు. పనులు జరిగినట్లుగా ఉంటే సీఎస్‌ను జైలుకు పంపిస్తామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. ఈ సారి విచారణలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు జైలు శిక్ష వేస్తే అదే సంచలనం అయ్యే అవకాశం ఉంది.