విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి కేసుకు సంబంధించిన ఎన్ఐఏ చార్జిషీట్లో.. వివరాలన్నీ.. వైసీపీ కోరుకున్నట్లే ఉన్నాయా..?. ఈ దాడి విషయాన్ని రాజకీయంగా సెంటిమెంట్‌గా మార్చుకుని సానుభూతి పొందాలని మొదటి నుంచి ప్రయత్నించిన వైసీపీ…ఆ పార్టీకి చెందిన మీడియా.. ఒకటే ప్రత్యేకంగా చెబుతున్నారు. శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి అభిమాని కాదని.. ఉద్దేశపూర్వకంగా.. జగన్‌ను చంపాలనే.. విమానాశ్రయంలో దాడి చేశారనేది… ఆ వాదన. కచ్చితంగా చంపాడానికే దాడి చేశారనే ఫీలింగ్ వస్తేనే.. వారు కోరుకునే సానుభూతి వస్తుందనేది.. వైసీపీ, ఆ పార్టీకి చెందిన మీడియా అభిప్రాయం కావొచ్చు. అలా ఉంటేనే.. కుట్ర కోణం ఉన్నట్లు ప్రచారం చేసుకోవచ్చు. అందుకే మొదటి నుంచి.. వైసీపీ నేతలు ఇదే వాదిస్తున్నారు. ఎన్ఐఏ చార్జిషీట్లో కూడా.. దాదాపుగా ఇదే అర్థంలో కొన్ని వాక్యాలు రాసుకొచ్చి.. వారి కోరికను తీర్చారు.
ఎన్ఐఏ అధికారులు… నిందితుడు.. ఊళ్లో.. ఆయన వేయించిన ఫ్లెక్సీ .. ప్రింటింగ్ చేసిన దుకాణంలో సహా… విమానాశ్రయం ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్నీ కూడా ప్రశ్నించారు. ఇక నిందితుడ్ని కూడా కస్టడీకి తీసుకున్నారు. నిందితుడు రాసుకున్నట్లు చెబుతున్న లేఖను.. కోర్టులో పిటిషన్ వేసి మరీ స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. తాము అక్కడ దర్యాప్తు చేసిన విషయాల్లో ఏమీ బయటపడిందో చెప్పలేదు. దాదాపుగా.. విశాఖ సిట్ అధికారులు చెప్పిందే.. మరో పద్దతిలో చెప్పుకొచ్చారు. కానీ విశాఖ సిట్ అధికారులు మాత్రం… కోడికత్తి శ్రీనివాసరావు జగన్ అభిమాని అని.. ఆయన ఫోన్లో ఉన్న సమాచారంతో పాటు.. ఆయన స్నేహితులు, సన్నిహితుల దగ్గర సమాచారాన్ని సేకరించారు. ఎందుకు దాడి చేయాలనుకుంటున్నారో.. తను రాసిన లేఖను.. సాక్ష్యంగా ఇచ్చారు. అవన్నీ.. ఎన్ఐఏ పట్టించుకోలేదు కానీ… జగన్‌ను చంపడానికే దాడి చేశానని… శ్రీనివాసరావు చెప్పినట్లు చార్జిషీట్లో ఓ చోట రాశారు. వైసీపీ కోరుకుంటున్నది కూడా. హత్యాయత్నం అని.. చార్జిషీట్లో ఉంటే మిగతా రాజకీయం తాము చేసుకుంటామన్న ఆలోచనలో వారు ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్లే ఎన్ఐఏ చార్జిషీట్లో ఆ మాట పెట్టింది.
కోడికత్తి దాడితో జగన్‌కు జరిగింది.. అతి చిన్న గాయమని.. ఎన్ఐఏ కూడా తేల్చింది. అయితే… మౌలికమైన విషయాల జోలికి పోలేదు. ప్రత్యక్ష సాక్షుల్ని విచారించిన ఎన్ఐఏ.. బాధితుడ్ని.. ప్రశ్నించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అసలు బాధితుడి దగ్గర వాంగ్మూలం తీసుకోకుండా.. చార్జిషీట్ వేయడం… ఏమిటో… చాలా మంది న్యాయనిపుణులకే అర్థం కాలేదు. జగన్.. ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వలేదు.. ఎన్ఐఏ పోలీసులు అడగలేదు. మొత్తానికి.. కోడి కత్తి కేసు విచారణ మాత్రం… మిస్టరీగా మారిపోతోంది. ముందు ముందు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మరి..!