ఎన్నికల్లో గెలవకుండానే జనసేన పార్టీ తొలి మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకుంది. ఆ మున్సిపాలిటీ నిడదవోలు. ఒక్క కౌన్సెలర్ కూడా జనసేన పార్టీకి లేకుండానే ఈ ఘనత సాధించారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యూహంతో ఇది సాధ్యమయింది.
రాజమండ్రి టిక్కెట్ కోసం ఆశించి చివరికి నిడదవోలు టిక్కెట్‌తో సరి పెట్టుకున్న కందుల దుర్గేష్ అనూహ్య విజయం సాధించారు. అప్పట్నుంచి వైసీపీ చేతిలోఉన్న మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు. మొత్తం 28 కౌన్సిలర్లకు జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. గడిచిన ఎన్నికల్లో వైసిపి 27 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి ఒక్క స్థానంలో గెలిచింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అభివృద్ధి కోసం వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అసలు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు ప్రత్యేకంగా జనసేన ఖాతాలో మున్సిపాలిటీ ఆడాల్సిన అవసరం లేదు. వారి చేరికతోనే జనసేన ఖాతాలోకి వచ్చినట్లయింది. కానీ అది ఫిరాయింపు అవుతుంది. కానీ వైసీపీలో మిగిలిన కౌన్సిలర్లు ఆ బాధ లేకుండా చేశారు.ల వారు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టారు. అలా అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన వారిలో కొందరు జనసేనలో చేరిపోయారు. దీంతో తీర్మానం చర్చకు రాకుండానే వీగిపోయింది. జనసేన పార్టీ ఇక్కడి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడం సాధారణ విషయం కాదని.. మంత్రి దుర్గేష్ రాజకీయ వ్యూహం అని ఆయన అనచరులు మీడియాకు సమాచారం పంపించారు.