ఇస్మార్ట్ శంకర్‌తో ఇద్దరు కథానాయికలకు కొత్త లైఫ్ వచ్చింది. వాళ్లే నభా నటేషా, నిధి అగర్వాల్. వీరిద్దరికీ ఇప్పుడు మంచి ఆఫర్లు అందుతున్నాయి. అఖిల్ సినిమాలో నభా హీరోయిన్ గా ఫిక్సయ్యిందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు నిధికి కూడా ఓ మెగా ఆఫర్ దక్కిందని సమాచారం. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బివిఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కథానాయికగా నిధి అరగ్వాల్ ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులో మరో హీరోయిన్‌కీ చోటు ఉందని తెలుస్తోంది. తానెవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ `ప్రతిరోజూ పండగే`లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే.. సుబ్బు సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.