‘శైలజారెడ్డి అల్లుడు’కి గుమ్మడికాయ కొట్టేశారు. గోవాలో చిత్రీకరించిన చివరి పాటతో సినిమా మొత్తం పూర్తయినట్టే! గోవా నుంచి తిరిగొచ్చిన నాగచైతన్య విశ్రాంతి గట్రా ఏం లేకుండా ‘సవ్యసాచి’ చిత్రీకరణ చేయడం ప్రారంభించాడు. అవును! ‘సవ్యసాచి’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది! ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చైతూ మరో సినిమా ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నార్ట! ఇప్పటికే విడుదల కావలసిన సినిమా పలుమార్లు వాయిదా పడింది. చివరికి నవంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా రెండు నెలలు సమయం ఉంది. కానీ, సీజీ వర్క్ అనుకున్నది అనుకున్నట్టుగా రావాలన్నా.. మళ్లీ మార్పులు ఏమైనా చేయాలన్నా… ముందుగా చిత్రీకరణ పూర్తి చేయడం ఉత్తమం అనే భావనలో చిత్రబృందం ఉంది. చివరికి హీరోయిన్ బర్త్‌డే రోజునా షూటింగ్‌కి సెలవు పెట్టలేదు. నిధి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈరోజు సెట్లో జరిగాయి. ఇప్పటికే టాకీ పూర్తి కావాలి. కానీ, ఆలస్యమైంది. తర్వగా టాకీ పూర్తి చేసి, ఒక్క సాంగ్ షూటింగ్‌కి ఫారిన్ ట్రిప్ వేయాలనుకుంటున్నారు.