సెప్టెంబర్ 6వ తేదీ.. గురువారం ఉదయం… ఓ శుభ ముహూర్తాన ప్రభాస్ కథానాయకుడిగా ‘జిల్’ ఫేమ్ కె.కె. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు.
సెప్టెంబర్ 9వ తేదీ.. శనివారం సాయంత్రం… సమయం 7.32 నిమిషాలు దాటింది… హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమైంది. రాత్రి వేళల్లో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించారు. నిజమే… #ప్రభాస్20 సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. త్వరలో అంటే ఇంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.
శనివారం ఉదయం ‘అరవింద సమేత వీరరాఘవ’కి డబ్బింగ్ చెప్పిన పూజా హెగ్డే, తరవాత మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రీరకరణలో పాల్గొన్నారు. తరవాత ప్రభాస్20 సెట్స్‌కి విచ్చేశారు. అర్ధరాత్రి వరకూ ప్రభాస్ సినిమా షూటింగ్ చేశారు. అయితే… హీరో షూటింగులో పాల్గొన్నాడా? లేదా? అనేది తెలియాల్సి వుంది. త్వరలో ఈ చిత్రబృందం ఇటలీ వెళ్లనుంది. అక్కడ ప్రభాస్, పూజా హెగ్డే తదితరులపై మేజర్ షెడ్యూల్ చేయనున్నారు.