ఈమధ్య కాలంలో ఇటు ప్రేక్షకుల్ని, అటు చిత్రబృందాన్నీ బాగా నిరుత్సాహానికి గురి చేసిన చిత్రాల్లో…. ‘ఒక మనసు’కి తప్పకుండా స్థానం ఉంటుంది. సినిమా ఎలా ఉంటుంది? ఎన్ని డబ్బులొస్తాయి? అనే అంచనాలు మామూలే అయినా.. ఈ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన నిహారికపైనే ఆశలెట్టుకొన్నారు. అయితే సినిమా తుస్సుమంది. నిహారిక నటన చూసి కూడా ‘అబ్బే..’ అని నిట్టూర్చారంతా. ఈ సినిమా ఫ్లాప్ తో నిర్మాతలకు ఎంత నష్టమొచ్చిందో తెలీదుగానీ…. నిహారిక మాత్రం నీరుగారిపోయింది. ఒక మనసు తరవాత.. టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాల్సిందే అని ప్రిపేర్ అయిపోయిన నిహారిక.. ఇప్పుడు ఆ ప్లాన్ నుంచి పక్కకొచ్చింది. మళ్లీ ఇప్పుడు బుల్లి తెరపై దృష్టి పెట్టాలని చూస్తోందట.
నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ప్రవీణ్ ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈసారీ నిహారిక కే ఆ అవకాశం వచ్చిందట. సినిమాల్లో ఎలాగూ జాతకం తేలిపోయింది కదా.. అని మళ్లీ తన పూర్వాశ్రమంలోకి అడుగుపెట్టడానికి నిహారిక సిద్ధమైనట్టు టాక్. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.