మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న తొలి హీరోయిన్… నిహారిక. ఒక్క సినిమా కూడా చేయకుండా ఈ అమ్మడిపై ఎన్ని నమ్మకాలో..? ఇంకెన్ని ఆశలో! నిజానికి నిహారిక వెండి తెరపై ఎంట్రీ ఇస్తోందనగానే మెగా అభిమానులు కాస్త పెదవి విరిచారు. ‘అగ్ర నటుల కుటుంబాల నుంచి కథానాయికలెవరూ రాలేదు. నిహారిక రావాల్సిన అవసరం ఏమిటి’ అన్నట్టు మాట్లాడుకొన్నారు. అయితే ఢీ పోగ్రామ్లో నిహారిక యాంకరింగు చూసి కాస్త కూల్ అయ్యారు. నిహారికలో హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయని వాళ్లూ గుర్తించారు. ఇప్పుడు మెగా అభిమానులతో పాటు ఇండ్రస్ట్రీ దృష్టి కూడా నిహారిక తొలి సినిమా ఒక మనసుపై పెట్టారు.
మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామరాజు దర్శకుడు. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగిందని టాక్. ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యిందట. శాటిలైట్కీ ఫ్యాన్సీ ఆఫర్లు అందుతున్నాయని టాక్. మొత్తానికి ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ కావడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. నిహారిక ఎఫెక్ట్ ఈ సినిమాపై పడిందని, అందుకే రిలీజ్ కాకుండానే సేఫ్ ప్రాజెక్టుగా మారిపోయిందని, నిహారికది లక్కీ హ్యాండని యూనిట్ మొత్తం సంతోషపడిపోతోంది.