మెగా డాటర్ నిహారిక కథానాయికగా తొలిసారి ఎంట్రీ ఇస్తోంది. ఒక మనసుతో. ఈ సినిమాకి సెంట్రాప్ ఎట్రాక్షన్ తనే. ఈ విషయం ఆఖరికి నాగశౌర్యకీ తెలుసు. తనని చూసే జనం థియేటర్లకు వస్తారు. ఓపెనింగ్ డే టికెట్లు తెగడానికి నిహారికనే కీలకం. పబ్లిసిటీలో కూడా ఆమెనే బాగా వాడుకోవాలని చిత్రబృందం కూడా ఫిక్సయ్యింది. అయితే నిహారిక మాత్రం.. ‘నో.. నెవ్వర్’ అంటూ భారీ డైలాగులు చెబుతోందట. ‘ఫలానా ఛానల్‌కి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తా.., ఫలానే పేపర్‌తోనే మాట్లాడతా’ అంటోందట. స్టార్ కథానాయికలు సైతం మీడియా మొత్తాన్ని కావాలనుకొంటారు. పబ్లిసిటీకి ఎంత కావాలంటే అంత సపోర్ట్ చేస్తారు. కానీ నీహారిక మాత్రం ఫస్ట్ సినిమాకే ఇలా అనడం దర్శక నిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అంతేనా.. అంటే ఇంకా చాలా ఉంది. నిహారిక డబ్బింగ్ చెప్పే విషయంలోనూ చిత్రబృందాన్ని బాగా ఇబ్బంది పెట్టిందట. డబ్బింగ్ మొదలెట్టి ఇన్ని రోజులైనా ‘రేపు చెబుతా, ఎల్లుండి చెబుతా’ అంటూ కాలయాపన చేసిందట. ఆఖరికి మరో డబ్బింగ్ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిన తరుణంలో నిహారిక… ఓ మెట్టు దిగి, డబ్బింగ్ థియేటర్లోకి అడుగుపెట్టిందట. మొదటి సినిమాకే నిహారిక ఈ టైపులో రెచ్చిపోవడం.. చిత్రబృందానికి జీర్ణం కాని విషయం. చిన్న పిల్ల కదా, అన్నీ మెల్లమెల్లగా తెలుసుకొంటుందిలే… అంటూ సర్దుకుపోతోంది టీమ్. ఈ విషయంలో నిహారికకు నాగబాబు, వరుణ్‌తేజ్ సలహాలివ్వొచ్చు కదా, వాళ్లేమో వాళ్ల వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ నిహారిక ఎప్పుడు తెలుసుకొంటుందో?