నిహారిక హీరోయిన్ అవుతోందంటే అందరికంటే ఎక్కువగా సంబర పడ్డారు మెగా అభిమానులు. ఆ ఇంటి నుంచి ఇప్పటి వరకూ హీరోలే వచ్చారు. నిహారిక తొలి హీరోయిన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాతో నిహా దుమ్ము దులపడం ఖాయం, సమంత తమన్నాలాంటివాళ్లంతా పెట్టే బేడా సర్దేసుకోవాల్సిందే అన్నంతగా మాట్లాడారు. కానీ ఆ సినిమా తుస్సుమంది. ఎంతలా అంటే… నిహా ఇప్పుడు మరో సినిమా ఒప్పుకోవడానికి సైతం జంకుతోంది. అయితే… నిహారిక నిజానికి హిట్టుతోనే తన ప్రయాణం మొదలెట్టాల్సిందట. ఇటీవల విడుదల పెను సంచలనంగా మారిన చిన్న సినిమా పెళ్లి చూపులు కథ ముందుగా నిహారిక దగ్గరకే వెళ్లిందట.
అయితే ఆ సమయంలో కథల ఎంపికపై అవగాహన లేకపోవడం, కొత్త దర్శకుడు కావడంతో… ఈ కథని నిహారిక పక్కన పెట్టిందట. దాంతో.. భలేంటి ఛాన్స్ మిస్సయిపోయింది. నిజంగా పెళ్లి చూపులు సినిమా నిహారికకి పడుంటే… ఆ సినిమానే కాదు… నిహారిక కెరీర్ కూడా వేరే రేంజులో ఉండేది. ఆ అదృష్టం రీతూవర్మకి దక్కిందిప్పుడు. నిహారిక మాత్రం ”నాకు పెళ్లి చూపులు లాంటి కథ కావాలి” అంటూ… తన దగ్గరకు వచ్చే దర్శకులకు చెప్తోందట. నిహా కూడా ట్రెండు ఫాలో అవుతోందన్నమాట.