మెగా కథానాయిక నిహారిక తొలి సినిమా అంటూ ఒక మనసుకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొన్నారు. అయితే ఆ ఆశలన్నీ ఒక మనసు అడియాశలు చేసింది. ఒక మనసుపై ‘బోరింగ్ మూవీ’ అన్న ముద్ర పడిపోయింది. ఈ సినిమాకి దూరంగా ఉండడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారు సినీ అభిమానులు. బ్రహ్మోత్సవం కంటే దారుణంగా ఉందని, ఒక విధంగా బ్రహ్మోత్సవమే బెటర్ అని నాన్ మెగా ఫ్యాన్స్ ఈసినిమాపై కౌంటర్లు కూడా వేసేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడో రూమర్ బయట తెగ తిరుగుతోంది. ఒక మనసు త్వరలోనే తమిళంలో రీమేక్ అవ్వబోతోందని… ధనుష్ ఈ సినిమాని రీమేక్ చేయాలన్న ఆరాటం వ్యక్తం చేస్తున్నాడన్నది ఆ రూమర్ల సారాంశం.
యాంటీ క్లైమాక్స్ సినిమాలు తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఒక్క ఎలిమెంట్ తప్ప… ఒక మనసులో ఏమీ లేదన్నది నిజం. పాత కథ, నీరసమైన కథనం… ఇలాంటి సినిమాల్ని ధనుష్ రీమేక్ చేయడానికి చూస్తున్నాడన్నది పెద్దజోక్లా వినిపిస్తోంది. సినిమాకి కాస్తో కూస్తో పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ఇలాంటి ఫీలర్లు వదలుతుంటారు. ఒక మనసు విషయంలోనూ అదే జరుగుతోందని, ఈ సినిమాని ధనుష్ రీమేక్ చేసేంత సీన్ లేదన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల వాదన. దాంతో ఒక మనసు రీమేక్ పెద్ద జోక్ గా మారింది. ఈ విషయంలో నిజానిజాలేంటో ఒక మనసు దర్శక నిర్మాతలకే తెలియాలి