మెగా డాటర్ గా నిహారిక కొన్ని వెబ్ సిరీస్లలో కనిపించింది. రెండు మూడు సినిమాలూ చేసేసింది. అయితే ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. ఈమధ్య పెళ్లి చేసుకుంది నిహారిక. ప్రస్తుతం… కొత్త జీవితం ఆస్వాదిస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలవైపు దృష్టి నిలిపిందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు నిహారిక ఓకే అనేసింది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. హీరో, పాటలూ, రొమాంటిక్ ట్రాకులూ.. ఆ హడావుడి లేని కథ ఇదని తెలుస్తోంది. అందుకే నిహారిక ఓకే చెప్పిందట. పైగా దర్శకుడితో ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఆ స్నేహం కొద్దీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. నిహారిక భర్త చైతన్యకి కూడా సినిమాలపై ఆసక్తి ఉందని, నటుడు కావాలన్న ప్లానింగ్స్ ఉన్నాయని ఇది వరకు చెప్పుకున్నారు. అయితే.. ఈ సినిమాలో తను కూడా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.